వేతన బకాయిలు చెల్లించాల్సిందే!

ABN , First Publish Date - 2022-10-12T04:41:48+05:30 IST

గ్రామ పంచాయతీ కార్మికులకు బకాయిపడ్డ వేతనాలను వెంటనే చెల్లించాలని పంచాయతీ కార్మి కుల యూనియన అన్నమయ్య జిల్లా గౌరవాద్యక్షుడు అబ్బవరం రామాంజులు డిమాండ్‌ చేశారు.

వేతన బకాయిలు చెల్లించాల్సిందే!

రాయచోటిటౌన, అక్టోబరు 11: గ్రామ పంచాయతీ కార్మికులకు బకాయిపడ్డ వేతనాలను వెంటనే చెల్లించాలని పంచాయతీ కార్మి కుల యూనియన అన్నమయ్య జిల్లా గౌరవాద్యక్షుడు అబ్బవరం రామాంజులు డిమాండ్‌ చేశారు.  రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భా గంగా బుధవారం రాయచోటి ఎంపీడీవో కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు ఆందోళన చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్నమ య్య జిల్లాలోని గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన రూ.10. 56 కోట్ల 15వ ఆర్థిక నిధుల నుంచి వేతన బకాయిలు చెల్లించా లని కోరారు. లేని పక్షంలో డీపీవో కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఈవోపీఆర్‌డీ సురేష్‌కు వినతిపత్రం అందజేశారు. పంచాయతీ కార్మికుల యూనియన జిల్లా ఉపాధ్య క్షుడు ఏవీ రమణ, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డెయ్య, రవీంద్ర, దేవరాయలు, ఆంజనేయులు, లక్ష్మిదేవి, హరి, చెన్నయ్య, రెడ్డిశేఖర్‌, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. 

రైల్వేకోడూరు(రూరల్‌): రైల్వేకోడూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద సీఐటీయూ జిల్లా కన్వీనర్‌ సీహెచ చంద్రశేఖర్‌, మండల కన్వీనర్‌ దాసరి జయచంద్ర, పంచాయతీ యూనియన అధ్యక్షు రాలు పెంచలమ్మ, ప్రధాన కార్యదర్శి ఎస్‌.చెన్నయ్య, పెంచలయ్య, శివయ్య, లక్ష్మీదేవి తదితరులు ఆందోళన చేశారు. 

Read more