-
-
Home » Andhra Pradesh » Kadapa » Registration of crop as a weapon-MRGS-AndhraPradesh
-
పకడ్బందీగా పంట నమోదు
ABN , First Publish Date - 2022-08-18T05:01:53+05:30 IST
రీ్ఫలో సాగైన పత్తి,తదితర పంటలను పకడ్బందీగా పంట నమోదు కార్యక్రమం చేయాలని మైదుకూరు వ్యవసాయ శాఖ ఏడీ కృష్ణమూర్తి పేర్కొన్నారు.

రాజుపాళెం, ఆగస్టు 17: ఖరీ్‌ఫలో సాగైన పత్తి,తదితర పంటలను పకడ్బందీగా పంట నమోదు కార్యక్రమం చేయాలని మైదుకూరు వ్యవసాయ శాఖ ఏడీ కృష్ణమూర్తి పేర్కొన్నారు. కొర్రపాడు గ్రామంలోని ఖరీ్‌ఫలో సాగైన పత్తిపంటను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నమోదును ఆర్బీకేలకు రైతులు వెళ్లి కచ్చితంగా పంట నమోదు చేసుకోవాలన్నారు. పంటకు ఏదైనా విపత్తు జరిగితే నమోదు చేసుకోవడం ద్వారా రైతులకు ఇన్సూరెన్స్, ఇన్‌ఫుట్ సబ్సిడీ వస్తుందన్నారు. పీఎం కిసాన్ డబ్బులకోసం ప్రతి రైతు ఈకేవైసీ తప్పనిసరి అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమలో ఏవో శివరామకృష్ణారెడ్డి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.