రాయలసీమ గర్జన అట్టర్‌ప్లాప్‌: టీడీపీ

ABN , First Publish Date - 2022-12-07T00:04:50+05:30 IST

రాయలసీమలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారాచంద్రబాబునాయుడు పర్యటన విజయవంతం కాగా, పోటీగా అధికార పార్టీ కర్నూలులో చేపట్టిన రాయలసీమ గర్జన అట్టర్‌ప్లాప్‌ అయిందని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, కడప నియోజకవర్గ ఇన్‌చార్జి అమీర్‌బాబు, రాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌లు ఏద్దేవా చేశారు.

రాయలసీమ గర్జన అట్టర్‌ప్లాప్‌: టీడీపీ

కడప, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : రాయలసీమలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారాచంద్రబాబునాయుడు పర్యటన విజయవంతం కాగా, పోటీగా అధికార పార్టీ కర్నూలులో చేపట్టిన రాయలసీమ గర్జన అట్టర్‌ప్లాప్‌ అయిందని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, కడప నియోజకవర్గ ఇన్‌చార్జి అమీర్‌బాబు, రాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌లు ఏద్దేవా చేశారు. మంగళవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అధికార వైసీపీని ప్రజలు విశ్వసించడం లేదన్న విషయం కర్నూలులో చేపట్టిన రాయలసీమ గర్జనకు జనం రాకపోవడంతో తేటతెల్లమవుతుందన్నారు. అమరావతిలోనే హైకోర్టు అంటూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరుపన న్యాయవాది చెబుతుంటే, కర్నూలులోనే హైకోర్టు అంటూ చెప్పడమే కాకుండా హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబు అడ్డంకి అని వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కోసం ఏనాడైనా సీఎం జగన్‌ డిల్లీకి వెళ్లారా, కేంద్ర న్యాయ శాఖమంత్రిని కలిశారా అని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాంతం అభివృద్ది చేయాలనుకుంటే వెనుకబడిన ప్రాంతమైన కడపలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండు చేశారు. ఇప్పటికి రాయలసీమ గర్జన దేని కోసమో ప్రజలకే ఆర్థం కావడం లేదన్నారు. సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వికాస్‌ హరిక్రిష్ణ, సీనియర్‌ నాయకులు లక్ష్మిరెడ్డి, పార్లమెంట్‌ మీడియా కోఆర్డినేటర్‌ జనార్థన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:04:54+05:30 IST