-
-
Home » Andhra Pradesh » Kadapa » Rayachoti RDO examination of pandana applications-MRGS-AndhraPradesh
-
‘స్పందన’ అర్జీలపై రాయచోటి ఆర్డీఓ పరిశీలన
ABN , First Publish Date - 2022-09-09T05:03:26+05:30 IST
భూ సమస్యలపై ‘స్పందన’లో వచ్చిన అర్జీలను రాయచోటి ఆర్డీవో రంగస్వామి గురువారం ఆయా భూములను పరిశీలించారు.

పీలేరు, సెప్టెంబరు 8: భూ సమస్యలపై ‘స్పందన’లో వచ్చిన అర్జీలను రాయచోటి ఆర్డీవో రంగస్వామి గురువారం ఆయా భూములను పరిశీలించారు. పీలేరు మం డలంలోని బోడుమల్లువారిపల్లె, పీలేరు, ముడుపులవేముల, కాకులారంపల్లె పం చాయతీల్లో పర్యటించారు. ఇందులో బో డుమల్లువారిపల్లె పంచాయతీలో వ్యవసా యేతర అవసరాల కోసం వ్యవసాయ భూ ముల మార్పునకు సంబంధించి 6, పీలేరు లో రెండు, ముడుపులవేముల పంచాయతీలో అందిన ఒక దరఖాస్తు మేరకు ఆయా భూములను సందర్శించారు. కాకులారంపల్లె పంచాయతీ పరిధిలోని ఆటోనగర్ లే-ఔ ట్, నెట్టిబండ వద్దనున్న కాలనీల్లో ఆక్రమణలు జరిగాయన్న ‘స్పందన’ ఫిర్యాదు మేరకు వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ నూతన నిబంధనల మేరకు లే-ఔట్‌లు వేస్తే అనుమతులు మంజూరు చేస్తున్నామని, ‘స్పందన’లో అందిన అర్జీలను సత్వరమే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు రవి, ఆర్‌ఐ భార్గవి, మండల సర్వేయర్ దేవి, ఆయా గ్రామాల వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.