రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలి
ABN , First Publish Date - 2022-02-14T05:06:48+05:30 IST
నందలూరు చెయ్యేరు నదిలో తెలుగుదేశం పార్టీ మండల నేతలు పసుపులేటి ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆదివారం జలదీక్ష నిర్వహించారు.
నందలూరు, ఫిబ్రవరి 13 : నందలూరు చెయ్యేరు నదిలో తెలుగుదేశం పార్టీ మండల నేతలు పసుపులేటి ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆదివారం జలదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, మాజీ ఎంపీపీ పల్లె సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి చెయ్యేరు గంగమ్మ తల్లి బుద్ధి చెప్పాలని జలదీక్ష చేస్తున్నామన్నారు. అన్ని వసతులు కలిగిన రాజంపేటను జిల్లా కేంద్రం కాదని రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను చేయడం దుర్మార్గమన్నారు. రాజంపేట ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని అన్నమయ్య జిల్లా కేంద్రంగా అన్నమయ్య పుట్టి నడయాడిన రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలన్నారు. ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ ఇద్దరు రాజీనామా చేసి రాజంపేట జిల్లా సాధన కోసం చేస్తున్న ఉద్యమంలో తమ వాణిని వినిపించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వారి ఇంటిని ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు మోడపోతుల రాము, తిరుపతయ్య, గుండు సురేష్, ముమ్మడిశెట్టి రమేష్, సుధాకర్‌తదితరులు పాల్గొన్నారు.