రైతు సంక్షేమ పథకాలకు మంగళం!

ABN , First Publish Date - 2022-06-08T04:53:24+05:30 IST

రైతులకు శాశ్వత ప్రయోజనాలు అందించే పథకాలకు వైసీపీ ప్రభుత్వం మంగళం పాడుతోందని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతం వెంకట శివారెడ్డి, ఐటీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి నాగేంద్ర ఆరోపిం చారు.

రైతు సంక్షేమ పథకాలకు మంగళం!
మాట్లాడుతున్న చింతంరెడ్డి, నాగేంద్ర

రాయచోటి టౌన్‌, జూన్‌7: రైతులకు శాశ్వత ప్రయోజనాలు అందించే పథకాలకు వైసీపీ ప్రభుత్వం మంగళం పాడుతోందని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతం వెంకట శివారెడ్డి, ఐటీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక  కార్యదర్శి నాగేంద్ర ఆరోపిం చారు. మంగళవారం వారు రాయచోటిలోని టీడీపీ కార్యాలయంలో విలేఖరుల సమా వేశంలో మాట్లాడారు రైతు పక్షపాతి అని గొప్పలు చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం రైతులకు ఎలాంటి రాయితీలు అంద కుండా చేస్తోందని ధ్వజమెత్తారు. వ్యవసాయ యాం త్రీకరణ కింద ఇచ్చే ట్రాక్టర్లు కూడా  వైసీపీ నాయకు లు, వారి సానుభూతిపరులకు మం జూరు చేసి రైతులకు అన్యాయం చేస్తోందని విమ ర్శించారు.  టీడీపీ హయాంలో ప్రతి ఏటా వేల సంఖ్యలో బిందు, తుపర సేద్య పరికరా లు రైతులకు అందించే వాళ్లని, దానివల్ల త క్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణం లోని పంట లను సాగుచేసుకునే అవకాశం కలిగేదని, దీంతో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరిగే దన్నారు.  వైసీపీ  అధికారంలోకి వచ్చినప్పటి నుండి సూక్ష్మ వ్యవసాయ విధానాలకు మంగ ళం పలికిం దని  విమర్శించారు. 

Read more