రైతుల కష్టాలను వివరించిన ‘వాన మెతుకులు’

ABN , First Publish Date - 2022-04-25T04:58:33+05:30 IST

వానమెతుకులు కథా సంకలనంలో రైతుల కన్నీళ్లు, కష్టాలను కళ్లకు కట్టినట్లుగా రాశారని శతావధాని నరాల రామారెడ్డి పేర్కొన్నారు.

రైతుల కష్టాలను వివరించిన ‘వాన మెతుకులు’
వానమెతుకులు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు టౌన్‌, ఏప్రిల్‌ 24 : వానమెతుకులు కథా సంకలనంలో రైతుల కన్నీళ్లు, కష్టాలను కళ్లకు కట్టినట్లుగా రాశారని శతావధాని నరాల రామారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వానమెతుకులు కథా సంకలనం పుస్తక పరిచయ సభను ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 మంది రచయితలు రాసిన రాయలసీమ రైతుల కథలను రచయితలు ఇనాయతుల్లా, రామమోహన్‌ వానమెతుకుల పేరుతో సంకలనం చేయడం అభినందనీయమన్నారు. వీరిలో కాశీవరపు వెంకటసుబ్బయ్య కథ ’పెన్నేటి బతుకు‘కు అవకాశం కల్పించారన్నారు. ఈ కథలో రైతుల కష్టాలను చక్కగా వివరించారన్నారు. రచయిత డీకే చదువుల బాబు మాట్లాడుతూ రైతుల పతనానికి ప్రృకతితోపాటు కల్తీ విత్తనాలు, నకిలీ ఎరువులు, దళారులు, వడ్డీ వ్యాపారులు వంటి కారణాలను మనసుకు హత్తుకునేలా రచించారన్నారు. అనంతరం కాశీవరపు వెంకటసుబ్బయ్యను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రచయితలు మహమ్మద్‌, ఎన్‌ఎస్‌ ఖలందర్‌, కామనూరు రామమోహన్‌, పల్లా కృష్ణ, కొత్తపల్లి శ్రీను, గోపాల్‌నాయక్‌, పల్లా రామారావు, పుత్తూరు సుబ్రహ్మణ్యం, చాడా మునిశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-04-25T04:58:33+05:30 IST