అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు గాలికి

ABN , First Publish Date - 2022-12-16T00:04:17+05:30 IST

అసంఘటితరంగ కార్మికుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గాలికొదిలేశాయని భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ అఖిల భారతీయ సంఘటన కార్యదర్శి బుజ్జి సురేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.

అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు గాలికి

- బీఎంఎస్‌, ఏబీఎస్‌ కార్యదర్శి సురేంద్ర

కడప (మారుతీనగర్‌), డిసెంబరు 15 : అసంఘటితరంగ కార్మికుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గాలికొదిలేశాయని భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ అఖిల భారతీయ సంఘటన కార్యదర్శి బుజ్జి సురేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కడప జిల్లా పర్యటనలో భాగంగా ఆయన కడపకు విచ్చేసి ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతిలోని ఎనటీసీ (కాటన) మి ల్లును మూసివేయడంతో కార్మికుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. దీంతో పాటు దేశ వ్యాప్తంగా సుమారు 23 నూలు మిల్లులను మూసివేయడంతో సంబంధిత చేనేత కార్మికులు రోడ్లపాలయ్యారన్నారు. తక్షణమే మిల్లులను తిరగి ప్రారంభించాలన్నారు. ఒప్పంద కార్మికులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారిని రెగ్యులరైజ్‌ చేయాలన్నారు. కనీస పెన్షనను రూ.5వేలకు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్‌ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ ఏపీ బొజ్జ రమేష్‌, టీవీ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:04:21+05:30 IST