కలిసి పోరాడితేనే సమస్యలు పరిష్కారం
ABN , First Publish Date - 2022-05-16T05:30:00+05:30 IST
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కా రం కావాలంటే కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ జనరల్ సెక్రటరీ ప్రతాప్‌రెడ్డి పిలుపునిచ్చారు.

జేఏసీ జనరల్ సెక్రటరీ ప్రతాప్‌రెడ్డి
వేతనాలకోసం కొనసాగిన ఆందోళన
ఎర్రగుంట్ల, మే 16: విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కా రం కావాలంటే కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ జనరల్ సెక్రటరీ ప్రతాప్‌రెడ్డి పిలుపునిచ్చారు. వేతనాలకోసం ఆర్టీపీపీలో కొనసాగుతున్న ధర్నాలో ఆయన సోమవారం ఉదయం 9.30 గంటలకు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం విద్యుత్ ఉద్యోగుల పరిస్థితి దృష్ట్యా విడివిడిగా ఆందోళన చేయడం సరికాదన్నారు. ఇది యాజమాన్యానికి అనుకూలం అవుతుందే తప్ప ఉపయోగం లేదన్నారు. ఉద్యోగుల సమ స్యలు పరిష్కారం కావాలంటే ముందుగా సంస్థను రక్షించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏదో ఒక యూనియన్, ఒక నాయకునిపై కోపంతో జేఏసీతో కాకుండా విడివిడిగా ఆందో ళనలు చేయవద్దని సూచించారు. కలిసికట్టుగా ఉండాలని, ఇప్పుడున్న యూనియన్ నాయకులపై పరిష్కారంకోసం ఒత్తిడి తేవాలన్నారు. అలా కాకుండా ఎవరికివారు విడిపోతే మన కన్నును మనమే పొడుచుకున్నట్లు ఉంటుందన్నారు. జీతాలు పడతాయని ఆందోళన ఆపాలని ఆయన ధర్నా చేస్తు న్నవారికి సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్64 నాయ కుడు పి.శివయ్య, హెచ్ 129 గిరిబాబు, టీఎన్‌వీకేఎస్ వీరా రెడ్డి, గంగాధర్, పార్థసారధినాయుడు, జగదీష్‌రెడ్డి, ఎస్.నూర్ బాషా, కొండారెడ్డి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. కాగా.. సోమవారం మధ్యాహ్నం ఉద్యోగులకు జీతాలు పడ్డాయి.