ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అరెస్టు అక్రమం: టీడీపీ

ABN , First Publish Date - 2022-10-15T04:20:21+05:30 IST

తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇనచార్జ్‌ ప్రవీణ్‌రెడ్డిని అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేయడం దారుణమని కడప పార్లమెంట్‌ టీడీపీ మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్‌బాషా తెలిపారు.

ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అరెస్టు అక్రమం: టీడీపీ

కమలాపురం రూరల్‌, అక్టోబరు 14 : తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇనచార్జ్‌ ప్రవీణ్‌రెడ్డిని అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేయడం దారుణమని కడప పార్లమెంట్‌ టీడీపీ మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్‌బాషా తెలిపారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసం టీడీపీ ఎప్పుడూ దుంటుందన్నారు. పాలకులు ఎన్ని కుతంత్రాలు చేసినా టీడీపీ కార్యకర్తలు భయపడరని, ఎక్కడ అవినీతి జరిగినా అక్కడ టీడీపీ నాయకులు ప్రత్యక్షమై ప్రశ్నిస్తారని ఆయన పేర్కొన్నారు.


Read more