ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
ABN , First Publish Date - 2022-05-25T05:01:25+05:30 IST
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఆర్. రమేష్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.
గాలివీడు, మే 24: ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఆర్. రమేష్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన వెలిగల్లు పంచాయతీలో పర్యటించి ప్రజా సమస్యల పై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు నిత్యావసరాలను కొనే పరిస్థితుల్లో లేరన్నారు. టీడీపీ ర హయాంలోనే గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు ఏర్పడ్డాయన్నారు. ప్రచార ఆర్భాటం తప్ప ఈ ప్రభుత్వానికి అభివృద్ధి చేతకాదని విమర్శించారు. విద్యుత్ చార్జీలు, బస్సు చార్జీలు పెంచడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. పూరిగుడిసెలకు వేలల్లో కరెంటు బిల్లులు వస్తున్నాయన్నారు. గత ప్రభుత్వంలో అడిగిన వారందరికీ ట్రాన్స్పార్మర్లను అందజేశామని, కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు. కులవృత్తి పరికరాలను సబ్సిడీపై అందించిన ఘనత చంద్రబాబునాయుడుదేనని కొనియాడారు. అనంతరం కృష్ణమూర్తి ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటనారాయణరెడ్డి, పూలుకుంట సర్పంచ్ పార్థసారథిరెడ్డి, మాజీ బోర్డు మెంబర్ మహబూబ్‌బాషా, మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య, టీడీపీ నాయకులు కృష్ణమూర్తి, శ్రీనివాసులు, మనోహర్, కదిరిరెడ్డి, డాక్టర్ రామచంద్రారెడ్డి, జక్రియాబాషా, ప్రభాకర్‌రెడ్డి, రామాంజులునాయుడు, నూరుల్లా తదితరులు పాల్గొన్నారు.