ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి
ABN , First Publish Date - 2022-12-15T23:15:07+05:30 IST
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని గురువారం మైదుకూరులో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పొట్టి శ్రీరాముల చిత్రపటం ఉంచి పూలమాలవేసి నివాళులర్పించా రు.
మైదుకూరు, డిసెంబరు 15: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని గురువారం మైదుకూరులో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పొట్టి శ్రీరాముల చిత్రపటం ఉంచి పూలమాలవేసి నివాళులర్పించా రు. ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో అమ్మవారిశాల లో ఆయన చిత్రపటంతో ర్యాలీ నిర్వహించి పొట్టి శ్రీరాములు సర్కిల్లో ఆయన విగ్రహం వద్ద నివా ళులర్పించారు. కార్యక్రమాల్లో భూమాయపల్లె పాఠ శాల ఉపాధ్యాయులు బీసీకే ప్రసాద్, వాసవీ క్లబ్ సరస్వతి పథకం ఛైర్మెన్ పబ్బతి గోపాల్, అధ్యక్షులు గుమ్మిడేల మధు, శంకూరి రమణయ్య, డీవీ సురేం ద్ర, రెడ్డి భార్గవ్, ఆర్యవైశ్యసంఘ నేతలు పాల్గొన్నారు.
బద్వేలులో....
బద్వేలు రూరల్, డిసెంబరు 15: భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడాలంటూ ఆమరణదీక్ష చేసి ప్రాణాల ర్పించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన అమరజీవి పొట్టిశ్రీరాములు అని ఆయన త్యాగాన్ని మరువలేర ని తెలు గు యువత జిల్లా ఉపాధ్యక్షు డు జహంగీర్ బాష అన్నారు. పొట్టిశ్రీరాములు వర్ధంతిని పురస్క రించుకుని గురువా రం ఆర్టీసీ బస్టాండు సమీపం లోని పొట్టిశ్రీరాములు విగ్రహా నికి నివాళులర్పించిన ఆయన మాట్లాడుతూ పొట్టిశ్రీరాము లు ప్రత్యేక రాష్ట్రం కోసం 1952 అక్టోబరు 19న మద్రాసు నగరంలోని సాంబమూర్తి ఇంట్లో ఆమర ణ దీక్ష చేపట్టి డిసెంబరు 15న ఆరోగ్యం క్షీణించి మరణించారన్నారు.
ఆయన మరణానంతరం తెలు గురాష్ట్రంలో ఎగిసిపడిన ఉద్యమాలు ఉధృతం కావ డంతో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి వాల్తాటి దానం, సుబ్బారెడ్డి, రసూల్, మల్లయ్య, మారయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రొద్దుటూరులో....
ప్రొద్దుటూరు టౌన్, డిసెంబరు 15: సర్దార్ వల్లభాయ్ పటేల్, పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఘనం గా నిర్వహించారు. గురువారం రామేశ్వరంలోని బాలబాలికల గ్రంథాలయంలో నివాళులర్పించిన చైతన్య సాంఘిక సేవా సంఘం అధ్యక్షుడు వెంకటరమణయ్య మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ 565 స్వదేశీ సంస్థానాలను భారత దేశంలో విలీనం చేసి ఉక్కు మనిషిగా గుర్తింపు పొందారన్నారు.
పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి పాటుపడ్డారని కొనియాడారు. దేశానికి వారు అందించిన సేవలు మరువలేనివని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ రికార్డు అసిస్టెంట్ ఇబ్రహీం సాహెబ్, వెంకటరమణ, భాస్కర్‌రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.
జమ్మల మడుగులో....
జమ్మలమడుగు రూరల్, డిసెంబరు 15: జమ్మలమడుగులో గురువారం అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి టీడీపీ ఇన్‌ఛార్జి దేవగుడి భూపేశ్‌రెడ్డి నివాళులర్పించారు.
రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టిశ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రా ణాలర్పించారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు రమణారెడ్డి, నవనీశ్వర్‌రెడ్డి, దేవగుడి యూత్ బృందం, ఖదీర్, సయ్యద్, రామచంద్రారెడ్డి, దాదాపీర్, రఫి, లక్షుమయ్య తదితరులు పాల్గొన్నారు.