వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు : ముగ్గురి అరెస్టు

ABN , First Publish Date - 2022-11-16T23:09:12+05:30 IST

మదనపల్లె పట్టణ శివారులోని చంద్రాకాలనీలో మంగళవారం రాత్రి టూటౌన పోలీసులు ఓ వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించారు. నిర్వాహకురాలితో సహా ఇద్దరు విటులు, ముగ్గురు యువతులను అరెస్టు చేశారు.

వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు : ముగ్గురి అరెస్టు
అరెస్టు చేసిన నిందితులతో పోలీసులు

మదనపల్లె క్రైం, నవంబరు 16: మదనపల్లె పట్టణ శివారులోని చంద్రాకాలనీలో మంగళవారం రాత్రి టూటౌన పోలీసులు ఓ వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించారు. నిర్వాహకురాలితో సహా ఇద్దరు విటులు, ముగ్గురు యువతులను అరెస్టు చేశారు. సీఐ మురళీకృష్ణ కథనం మేరకు.. పట్టణానికి చెందిన అమ్మా జాన చంద్రాకాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమా చా రం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. నిర్వాహ కురాలితోపాటు బసినికొండకు చెందిన సాదిక్‌, వాల్మీకి పురం మండలం చింతపర్తికి చెందిన సతీష్‌, కడప, హైదరా బాద్‌, బెంగళూరుకు చెందిన ముగ్గురు యువతులను అరెస్టు చేసి సే ్టషనకు తరలించారు. నిందితులతోపాటు ఇంటి యజమానిపై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ వివ రించారు. అమ్మా జాన సోషల్‌ మీడియా ద్వారా యువకులను ఆకర్షిస్తోందన్నారు. నిందితులను రిమాండుకు తరలించి, ఇంట్లో ఉన్న మూడు సెల్‌ఫోన్లు, రూ.3 వేలు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్‌ఐ చంద్రమోహన, సిబ్బంది పాల్గొన్నారు.

=====================

Updated Date - 2022-11-16T23:09:12+05:30 IST

Read more