బాహుదా నీరు వృథా

ABN , First Publish Date - 2022-08-09T05:23:32+05:30 IST

మండలంలోని ముష్టూరు పంచాయతీలో నిర్మిం చిన బాహుదా ప్రాజెక్టు నీరు వృథాగా పోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

బాహుదా నీరు వృథా
బాహుదా నుంచి వృథాగా పోతున్న నీరు



మరమ్మతులకు నోచుకోని     ఎడమ, కుడి కాలువలు 

 అధిక ధరలతో క్రాప్‌ హాలిడే     ప్రకటించిన రైతన్నలు

నిమ్మనపల్లె, ఆగస్టు 8: మండలంలోని ముష్టూరు పంచాయతీలో నిర్మిం చిన బాహుదా ప్రాజెక్టు నీరు వృథాగా పోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఈ ప్రాజెక్టు కింద దాదాపు 3 వేల ఎకరాలకు పైగా సాగు భూమి ఉంది. గతంలో ప్రాజెక్టు నిండితే రైతన్నల పంట పండేది. అయితే  నెల రోజుల క్రితం ప్రభుత్వం సాగు కొరకు నీటిని కుడి, ఎడ మ కాలువలకు నీటిని విడుదల చేసినప్పటికి రైతులు పంటలు పండిం చేందుకు ముందుకు రావడం లేదు. దాదాపు రూ.200 కోట్లతో కాలువ నిర్మాణ  పనులను చేపట్టినా అవి నాణ్యత లేకపోవడం కాలువలకు రం ఽద్రాలు పడి పలు చోట్ల సిమెంట్‌ దిమ్మెలతో చేసిన కాలువలు కూడా పడిపోవడంతో నీరు వృథాగా పోతోంది.  ప్రస్తుతం బహుదాలో 398 ఎంసీఎఫ్‌టీ నీరు ఉండాల్సి వుండగా అది కాస్త 96ఎంసీఎఫ్‌టీలకు పైగా నీరు విడుదలతో ఖాళీ అయింది. పలువురు రైతులు మాట్లాడుతూ తామెన్నడు వ్యవసాయాన్ని చేయకుండా వదిలిపెట్టిన ధాఖలాలు లేవని ప్రస్తుతం అధిక ధరల కారణంగా క్రాఫ్‌ హాలీడేను చేపట్టినట్లు తెలి పారు. ఎక్కడో ఒక చోట టమోటా పంటను రైతులు పండించినప్పటికి వాటి ధర కూడా పతనం కావడంతో చేసేదేమీ లేక పలువురు రైతులు పాడి ఆవులను పోషించుకుంటున్నారు. ఇరిగేషన్‌ అధికారులు బాహుదా నుంచి నీటీని విడుదల చేసినప్పటికి కాలువలు సక్రమంగా లేక వృఽథా గా పోతుందని ఇలాంటి తరుణంలో  పంటలు లేనపుడు నీటి విడుదల ను వెంటనే నిలిపి వేయాలని రైతన్నలు కోరుతున్నారు.

అధిక ధరలతో సాగు మానేశాం


అధిక ధరల కారణంగా పంటలు వేయడం మానేశాం. ట్రాక్టర్‌తో పొలం దున్నాలంటే గంటకు దాదాపు రూ.1000 పైగా ఖర్చు వస్తోంది. దీనికి తోడు కూలీల భారం ఎక్కువ కావడం. అలాగే ఎరువులు తదితర క్రిమిసంహారక మందులు బాదుడుతో వ్యవసాయాన్ని మానివేశాం. ఎంతో మంది రైతులు సాగును వదిలేసి వేరే పనులను చేపడుతు న్నారు. బాహుదాలోని నీటిని విడుదల చేసినప్పటికి ఎటువంటి ప్రయో జనము లేదు. 

-వెంకటరమణ(ఎర్రప్పగారిపల్లె), నిమ్మనపల్లె మండలం 

మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపించాం

బాహుదా ప్రాజెక్టు కింద ఉన్న  కుడి, ఎడమ కాలు వల మరమ్మతుల కొరకు  ప్రతిపాదనలు పంపించాం. అయితే ప్రస్తుతానికి సాగునీటిని విడుదల చేయలేదని లీకేజీ నీరు మాత్రమే వస్తుందన్నారు. రైతులు పంటలు పండించనం దున నీటిని ఆపివేసినట్లు తెలిపారు. వాటితో పాటుగా మరికొన్ని కాలువలను కూడా మరమ్మతులు చేయాల్సి ఉందన్నారు. 

-శ్రీహరిరెడ్డి, ఇన్‌ఛార్జ్‌ ఇరిగేషన్‌ ఏఈఈ



Updated Date - 2022-08-09T05:23:32+05:30 IST