ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ

ABN , First Publish Date - 2022-12-09T23:41:18+05:30 IST

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
చిట్వేలి మండలం ఎగువపాలెం వరద ప్రాంత ప్రజలతో మాట్లాడుతున్న సీఐ విశ్వనాథరెడ్డి

రాయచోటిటౌన్‌, డిసెంబరు 9: మండూస్‌ తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హర్షవర్థన్‌రాజు అన్నారు. శుక్రవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తుఫాన్‌ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి గండిపడే అవకాశం ఉందని, ముందస్తుగా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమై ప్రజలు ఇబ్బంది పడకుండా సహాయక చర్యలు చేపట్టారన్నారు. ముఖ్యంగా భారీ వర్షాలకు విద్యుత్‌ స్తంభాలు, చెట్లు రోడ్డుపై నేలకొరిగి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నారన్నారు. అవసరమైన చోట తగిన బందోబస్తు ఏర్పాటుతో పాటు అత్యవసర సహాయక బృందాలను అందుబాటులో ఉంచామన్నారు. వాగులు, వంకలు, వరద నీటిలో ప్రజలు చిక్కుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. రెవెన్యూ, మున్సిపల్‌/గ్రామ పంచాయతీ అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టేందుకు పోలీసు సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని, ఏదైనా అత్యవసరమైతే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని ఆయన సూచించారు.

Updated Date - 2022-12-09T23:41:20+05:30 IST