ఎమ్మెల్యే అసమర్ధతతోనే ప్రజలకు తీవ్ర ఇక్కట్లు: టీడీపీ

ABN , First Publish Date - 2022-10-08T04:10:38+05:30 IST

ప్రస్తుతం కమలాపురం అష్టదిగ్బంధంలో ఉందని, ఎమ్మెల్యే అసమర్ధతతోనే ప్రజలకు ఇక్కట్లు ఎదు రవుతున్నాయని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అంకిరెడ్డి వాసుదేవరెడ్డి తెలిపారు.

ఎమ్మెల్యే అసమర్ధతతోనే ప్రజలకు తీవ్ర ఇక్కట్లు: టీడీపీ

కమలాపురం రూరల్‌,  అక్టోబరు 7: ప్రస్తుతం కమలాపురం అష్టదిగ్బంధంలో ఉందని, ఎమ్మెల్యే అసమర్ధతతోనే ప్రజలకు ఇక్కట్లు ఎదు రవుతున్నాయని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అంకిరెడ్డి వాసుదేవరెడ్డి తెలిపారు. శుక్రవారం గోపాలపురం గ్రామ సమీపంలోని వంకను   పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్లే కమలాపురం అష్టదిగ్బంధంలో కూరుకుపోయిందన్నారు. రబీ సీజన కావడం వల్ల రైతులు ఎరువులు, విత్తనాలు సరఫరా చేసుకునేందుకు రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. మండలంలోని పాచికలపాడు- గోపాలపురం మధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న వంక ధాటికి రాకపోకలకు అంతరాయం ఏర్పడిందన్నారు. ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయన్నారు. గ్రామస్తులతో కలిసి శ్రమదానం చే సి  మూడు రోజులలో రాకపోకలకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి మాజీ చైర్మన జంపాల నరసింహారెడ్డి, గోపాలపురం టీడీపీ నాయకుడు గంగిరెడ్డి, కమలాపురం మండల రైతు అధ్యక్షుడు రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-08T04:10:38+05:30 IST