కరెంటుతో పింఛన్‌ కట్‌..

ABN , First Publish Date - 2022-12-30T23:52:10+05:30 IST

వినియోగదారుల గ్రహచారమో.. కర్మచారమో కానీ కొద్ది రోజులుగా విద్యుత్‌ బిల్లులు వినియోగదారులకు గుండెపోటు తెప్పిస్తున్నాయి. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం వల్ల అధిక మోతాదులో విద్యుత్‌ బిల్లు రావడంతో ఒక దళితుడికి నెల నెల వచ్చే పింఛన్‌ రద్దయ్యే పరిస్థితి నెలకొన్నది.

కరెంటుతో పింఛన్‌ కట్‌..
కరెంటు బిల్లు ఎక్కువ రావడంతో పింఛన్‌ రద్దు చేయడానికి అధికారులు ఇచ్చిన నోటీసులు చూపిస్తున్న రామచంద్ర

ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం

దళితుని ఇంటికి రూ.35 వేల కరెంటు బిల్లు

రద్దయిన తండ్రి పింఛన్‌

ఖంగుతిన్న వినియోగదారుడు

గాలివీడు, డిసెంబరు 30: వినియోగదారుల గ్రహచారమో.. కర్మచారమో కానీ కొద్ది రోజులుగా విద్యుత్‌ బిల్లులు వినియోగదారులకు గుండెపోటు తెప్పిస్తున్నాయి. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం వల్ల అధిక మోతాదులో విద్యుత్‌ బిల్లు రావడంతో ఒక దళితుడికి నెల నెల వచ్చే పింఛన్‌ రద్దయ్యే పరిస్థితి నెలకొన్నది. బాధితుని కథనం మేరకు...

మండలంలోని చీమలచెరువుపల్లె గ్రామం గుర్రంవాండ్లపల్లె హరిజనవాడకు చెందిన బాలపోగు సురేంద్ర ఇంటి సర్వీస్‌ నెంబరు 2412740000120 ఒక బల్బు, ఫ్యానుకు రూ. 35,201 కరెంటు బిల్లు వచ్చింది. సాధారణంగా పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థల్లో రావాల్సిన బిల్లు కేవలం ఒక సాధారణ గృహానికి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రెక్కాడితే గానీ డొక్కాడని తమలాం టి దినసరి కూలీలకు పుండు మీద కారం చల్లిన ట్లు ఇంత పెద్ద మొత్తంలో బిల్లు రావడం ఏంటని ఇంటి యజమాని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఈ బిల్లు కట్టాలంటే ఇళ్లు అమ్ముకోవాల్సి ఉంటుం దని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వ నిబంధన ల ప్రకారం దళితులకు నెలకు 200 యూనిట్లు కరెంటును వాడుకొనే వెసులు బాటు ఉన్నదని, తాము ప్రతి నెల 200 యూనిట్లు కన్నా తక్కువే వినియోగించుకుంటున్నామన్నారు. కాగా నవంబరు ఒక నెలలోనే రూ.35,201 కరెంటు బిల్లు రావడంతో షాక్‌కు గురయ్యానని తెలిపాడు. పెద్ద మొత్తంలో బిల్లు వస్తే సదరు బిల్లును సాధారణంగా సెక్షన్‌ అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించి సంబంధిత సెక్షన్‌ అధికారులతో చర్చించిన అనంతరమే తమకిస్తారని, కానీ ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.

కొడుకు కరెంటు బిల్లుతో తండ్రికి పింఛన్‌ రద్దు

ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం కారణంగా బాధితుడు సురేంద్ర కు వచ్చిన కరెంటు బిల్లుతో అతని తండ్రి రామ చంద్రకు పింఛను రద్దయ్యే పరిస్థితి వచ్చింది. తండ్రి, కుమారుడికి విడివిడిగా రేషన్‌కార్డులు ఉన్నాయి. కానీ కుమారుడు తక్కువ యూనిట్ల విద్యుత్‌ వాడినా అధిక మొత్తంలో కరెంటు బిల్లు రావడంతో, సదరు కారణాన్ని చూపి తండ్రి రామ చంద్రకు నెలవారి వస్తున్న పింఛను రద్దుకు నోటీ సులు వచ్చాయి. తండ్రి, కుమారుడు వేర్వేరుగా ఉంటున్నా అధికారులు చూపిన అత్యుత్సాహంతో పింఛన్‌ రద్దుకు నోటీసు రావడంతో వృద్ధాప్య గుండె గుబేల్‌మంటోంది.

బాధితుడి తండ్రి రామచంద్ర మాట్లాడుతూ.. ‘ప్రతిరోజూ నేను కూలిపని చేసుకుంటే గానీ పూ ట గడవదు. నాకు ఒక సెంటు భూమి కూడా లే దు. కూలి, నాలి చేసుకుంటూ నెలవారి వచ్చే పిం ఛన్‌తో బతుకుతున్నా. ట్రాన్స్‌కో, ప్రభుత్వ అధికా రుల నిర్లక్ష్యంతో నా కుమారుడికి అధిక మొత్తం లో బిల్లు రావడంతో నాకు వస్తున్న పింఛన్‌ నిలి చిపోయే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి సచివాలయ సిబ్బంది నోటీసులు కూడా ఇచ్చారు. ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేసి తన పింఛన్‌ రద్దు కాకుండా చూడాలి’ అని వేడుకొంటున్నాడు.

బాధితుడికి న్యాయం చేస్తా..

సురేంద్ర ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు విషయంపై ఇప్పటి వరకు పూర్తి వివరాలు నా దృష్టికి రాలేదు. బాధితుడు సురేంద్ర తమ వద్దకు వస్తే పరిష్కరించి న్యాయం చేస్తాను.

- నరేంద్రారెడ్డి, విద్యుత్‌ ఏఈ, గాలివీడు

Updated Date - 2022-12-30T23:52:11+05:30 IST