పార్కు పనులపై ప్రత్యేక దృష్టి పెట్టండి
ABN , First Publish Date - 2022-07-06T05:05:51+05:30 IST
రాయచోటి తిరుపతినాయుడు కాలనీలో జరుగుతున్న పార్కు నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పీఎస్ గిరీషా అధికారులను ఆదేశించారు.

అనుమతులు లేకుండా లేఅవుట్‌లు వేస్తే చర్యలు
కలెక్టర్ పీఎస్ గిరీషా
రాయచోటి (కలెక్టరేట్), జూలై 5: రాయచోటి తిరుపతినాయుడు కాలనీలో జరుగుతున్న పార్కు నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పీఎస్ గిరీషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో రాయచోటి పట్టణాభివృద్ధిలో భాగంగా రాజీవ్ స్వగృహలో పార్కు నిర్మాణం, ఎంఐజీ లేఅవుట్, డ్రైనేజీ, వాటర్‌సప్లై, రహదారుల నిర్మాణాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దిగువ అబ్బవరంలోని ఎంఐజీ లేఅవుట్ సమీపంలో ఆర్డీవో కార్యాలయానికి పది ఎకరాలలోపు స్థలం కేటాయించాలని తహసీల్దార్‌కు తెలిపారు. ఎంఐజీ లేఅవుట్‌లో భూగర్భ డ్రైనేజీ పనులు, వాటర్‌సప్లై పనులు ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలన్నారు. రింగు రోడ్డు నుంచి దిగువ అబ్బవరం లేఅవుట్‌కు వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతినాయుడు కాలనీలో పార్కు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి పార్కు డిజైన్ ప్రకారం వెంటనే పనులు మొదలుపెట్టి మట్టితో నింపి భూమి చదును చేసి మొక్కలను నాటాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. అనుమతులు లేకుండా లేఅవుట్ వేస్తే చర్యలు తీసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం సహించేది లేదని అధికారులను ఆయన హెచ ్చరించారు. సమావేశంలో ఆర్డీవో రంగస్వామి, అన్నమయ్య అర్బన్ డెవల్‌పమెంట్ వీసీ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.