బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి

ABN , First Publish Date - 2022-10-08T04:04:49+05:30 IST

బడి బయట పిల్లలందరినీ గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని కడప ఉప విద్యాధికారి రాజగోపాల్‌రెడ్డి సూచించారు.

బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి

- ఉప విద్యాధికారి రాజగోపాల్‌రెడ్డి

కడప (ఎడ్యుకేషన), అక్టోబరు 7: బడి బయట పిల్లలందరినీ గుర్తించి  పాఠశాలల్లో చేర్పించాలని కడప ఉప విద్యాధికారి రాజగోపాల్‌రెడ్డి సూచించారు. శుక్రవారం కడప నగరం మండల వనరుల కేంద్రంలో ఎంఈఓ పాలెం నారాయణ అధ్యక్షతన ఏఆర్‌పీలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని యాజమాన్యాల్లో చదువుతున్న విద్యార్థులు తరగతి గదిలో ఆనలైనలో ఒకే సంఖ్య ఉండేలా చూసుకోవాలని పాఠశాల యాజమాన్యాలకు, కరస్పాండెంట్లకు, ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఏ విద్యార్థి అయినా ఒక పాఠశాలలో చదువుతూ వేరొక పాఠశాలలో ఆనలైనలో ఉన్నట్లయితే వెంటనే ఎంఈవో దృష్టికి తీసుకెళ్లి సీఆర్పీల ద్వారా సమస్యను పరిష్కరించాలన్నారు. ఏ విద్యార్థి అయినా పాఠశాల నుంచి వెళ్లిపోయే సమయంలో ఆనలైన నుంచి తొలగించేటప్పుడు తప్పనిసరిగా ఆనలైన ఓపెన చేసి ఆప్షన మాత్రమే ఉపయోగించాలని డ్రాపవుట్‌ ఆప్షనను ఉపయోగించవద్దని సూచించారు. ఒక విద్యార్థి ఒక పాఠశాల విద్యాభ్యాసం చేస్తూ మరొక పాఠశాలలో ఆనలైనలో ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇరు పాఠశాలల యాజమాన్యాలపై చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ కార్యాలయం టెక్నికల్‌ సిబ్బంది బ్రహ్మానందరెడ్డి, జ్వాలాపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-08T04:04:49+05:30 IST