మహానాడులో మన కళాకారులు
ABN , First Publish Date - 2022-05-29T05:19:05+05:30 IST
ఒంగోలులో నిర్వహించిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో మైదుకూరు పార్వతీనగర్ కళాకారులు అలరిస్తున్నారు.

మైదుకూరు, మే 28: ఒంగోలులో నిర్వహించిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో మైదుకూరు పార్వతీనగర్ కళాకారులు అలరిస్తున్నారు. కొండపల్లి ఉమాకాంత్ బృందం వేదికపై పార్టీ రూపొందించిన పాటలను ఆడిపాడి కార్యకర్తలను ఆకట్టుకుంది. టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షే మ పథకాలను వివరిస్తూ ప్రస్తుత ప్రభుత్వంలో వ్యతిరేక విధానాలతో కూడిన జానపద గీతం రూపంలో ప్రధాన వేదికపై ఆడుతూ పాడుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.