-
-
Home » Andhra Pradesh » Kadapa » Opposition to the government has grown among the people the TDP-MRGS-AndhraPradesh
-
ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది: టీడీపీ
ABN , First Publish Date - 2022-06-08T05:17:02+05:30 IST
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అన్నారు.

కమలాపురం రూరల్, జూన 7: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అన్నారు. మంగళవారం టీడీపీ కార్యాలయ ఆవరణంలో ఏర్పా టు చేసిన గ్రామ కమిటీల బలోపేతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా పార్లమెంట్ అధ్యక్షుడు లింగారెడ్డి హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు. అంతేకాకుండా పదవ తరగతి పరీక్షలకు ప్రభుత్వ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల వద్ద విధులకు వేయడం ఎంతవరకు సబబు అన్నారు. పా ఠాలు నేర్పాల్సిన విద్యార్థులకు ఉపాధ్యాయులు అలా వెళ్లడంతోనే ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించలేదని విమర్శించారు. వైసీపీ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేసి టీడీపీ అధికారంలోకి వచ్చేం దుకు కృషి చేయాలన్నారు. జిల్లా మైనార్టీ నాయ కులు ఖాదర్‌బాషా, దివాకర్‌రెడ్డి, జంపాల నరసింహారెడ్డి, ఎల్లారెడ్డి, ఎర్రగుడిపాడు మహేశ్వర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.