విత్తన దుకాణాలపై విజిలెన్స్‌ దాడులు

ABN , First Publish Date - 2022-05-18T05:30:00+05:30 IST

పట్టణంలోని పురుగు మందులు, ఎరువులు, విత్తన దుకాణాలపై బుధవా రం విజిలెన్స్‌ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

విత్తన దుకాణాలపై   విజిలెన్స్‌ దాడులు

ప్రొద్దుటూరు రూరల్‌, మే 18: పట్టణంలోని పురుగు మందులు, ఎరువులు, విత్తన దుకాణాలపై బుధవా రం విజిలెన్స్‌ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. కడప రీజినల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రాంతీయ అధికారి బి.ఉమామహేశ్వర్‌ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ దాడుల్లో విజిలెన్స్‌ అధికారులు, మండల వ్యవసాయాధికారులు సం యుక్తంగా దుకాణాల రికార్డుల్లో ఉన్న మేరకు సరు కు నిల్వలను పరిశీలించారు. విత్తన దుకాణాల్లో రికార్డులను స్వాధీనం చేసుకుని గోడౌన్లలోని సరుకు ను స్టాక్‌తో సరిచూశారు.

ఖరీఫ్‌ సీజన్‌ మొదలు కా వడంతోనే రైతులు విత్తనాల కోసం వస్తారని షాపు ల యజమానులు నకిలీ విత్తనాలు అంటగడతారనే ఉద్దేశంతో ఈ దాడులు నిర్వహించినట్లు విజిలెన్స్‌ అధికారులు పేర్కొన్నారు. రైతులకు నాశిరకం విత్తనాలు, నకిలీ పురుగు మందులు, ఎరువులు అంటగడితే షాపులను సీజ్‌ చేసి కఠిన చర్యలు తీసుకుం టామని విజిలెన్స్‌ అధికారులు వ్యాపారులను హెచ్చరించారు. నాణ్యత ప్రమాణాలు కలిగి ఉండాలని ప్రభుత్వ ధ్రువీకరణ ఉన్నవాటినే రైతులకు విక్రయించాలని సూచించారు. దాడుల్లో బహిర్గతమైన వివరాలను నివేదికరూపంలో జిల్లా ఉన్నతాధికారులకు సమర్పిస్తున్నట్లు తెలిపారు. విజిలెన్స్‌ అధికారి పి.రామకృష్ణ, ఏఓలు బాలగంగాధర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read more