-
-
Home » Andhra Pradesh » Kadapa » On infectious diseases A comprehensive survey should be undertaken-MRGS-AndhraPradesh
-
అసంక్రామిక వ్యాధులపై సమగ్ర సర్వే చేపట్టాలి
ABN , First Publish Date - 2022-03-06T04:48:26+05:30 IST
అసంక్రామిక వ్యాధులు, జాతీయ కుష్ఠు సర్వే పై వైద్య సిబ్బంది సమ గ్ర సర్వే చేపట్టాలని రాయలసీమ జోనల్ అ ధికారి సతీష్, అదనపు జిల్లా వైద్యాధికారి ఖా దర్ వల్లీ పేర్కొన్నారు.

నందలూరు, మార్చి5: అసంక్రామిక వ్యాధులు, జాతీయ కుష్ఠు సర్వే పై వైద్య సిబ్బంది సమ గ్ర సర్వే చేపట్టాలని రాయలసీమ జోనల్ అ ధికారి సతీష్, అదనపు జిల్లా వైద్యాధికారి ఖా దర్ వల్లీ పేర్కొన్నారు. శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సభాభవనంలో వారు మాట్లాడుతూ అసంక్రామిక వ్యాధిగ్రస్తులపై వంద శాతం సర్వే చేపట్టాలని సూచించారు. కుష్ఠు వ్యాధిగ్రస్తుల శరీరం పై మచ్చలను పరీక్షించాలన్నారు. గ్రామాల్లో ఇంటింటి సర్వే చేసి బీపీ షుగర్‌తో బాధపడుతున్న వారిని గుర్తించి వైద్యం అందించాలన్నారు. ఆశాలు, ఏఎన్‌ఎంలు వలంటీరు ద్వారా 100 శాతం సర్వే చేపట్టాలన్నారు. డాక్టర్ సృజన, డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.