అరటితోటలను పరిశీలించిన అధికారులు

ABN , First Publish Date - 2022-12-16T23:00:47+05:30 IST

మాండస్‌ కారణం గా దెబ్బతిన్న అరటితోటలను శుక్రవారం జాతీయ అరటి పరిశోధన కేంద్రం సాంకేతిక అధికారులు పరిశీలించారు.

అరటితోటలను పరిశీలించిన  అధికారులు
హస్తవరంలో అరటితోటలను పరిశీలిస్తున్న అరటి పరిశోధన కేంద్రం అధికారులు

రాజంపేట, డిసెంబరు 16: మాండస్‌ కారణం గా దెబ్బతిన్న అరటితోటలను శుక్రవారం జాతీయ అరటి పరిశోధన కేంద్రం సాంకేతిక అధికారులు పరిశీలించారు. మండలంలోని హ స్తవరం, చెర్లోపల్లె, పెద్దకారంపల్లె, చిట్వేలి మం డలంలోని నాగవరం, సీఎం రాచుపల్లె, కోడూ రు మండలంలోని జేఆర్‌ కండ్రిగల్లో దెబ్బతిన్న తోటలను పరిశీలించారు. జాతీయ అరటి పరి శోధన కేంద్రం సాంకేతిక అధికారులు డాక్టర్‌ పళనిస్వామి, ఆర్‌పి ముత్తు, జిల్లా ఉద్యాన అధి కారి రవీంద్రబాబు పరిశీలించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు సంభవించినపుడు గాలి ఉధృతి కారణంగా చెట్లు నేలవాలకుండా పొలాల చుట్టూ అవిశ చెట్లు వేయాలన్నారు. అరటిచెట్లకు ఊతకర్రలు నాటాలన్నారు. అరటి తోటల్లో వర్షపు నీరు నిలుకుండా చూడాలన్నారు. సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమయంలో సిగటోక తెగులు వస్తున్నందున ఉద్యానవన అధికారుల సలహా మేరకు పిచికారీ మందులు వాడాల న్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన అదికా సురేష్‌బాబు, ఆషియ, రామ్మోహన్‌ రాజు, సంపూర్ణ, కళ్యాణ్‌, శ్రీరామ్‌, వెంకటాద్రి, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పరిహారం చెల్లించాలి..

రైల్వేకోడూరు: మండలంలోని చియ్యవరం పంచాయతీ కేఆర్‌ కండ్రికలో శుక్రవారం మాం డస్‌ తుఫాన్‌తో దెబ్బతిన్న అరటి తోటలను రైల్వేకోడూరు రాష్ట్ర కిసాన్‌ మోర్చా కన్వీనర్‌ తో ట శ్రీనివాసులు, జిల్లా కిసాన్‌ మోర్చా అధ్య క్షుడు కంబాల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి జానం బాలాజీ పరిశీలించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ అరటి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకుని నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ఎకరాకు రూ. 50 వేలు పరిహారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు వాకచర్ల సుబ్బారావు, నాయకులు ఊటుకూరు చలపతి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ జయ ప్రకాష్‌ నారాయణవర్మ తదితరులు పాలొ ్గన్నారు.

Updated Date - 2022-12-16T23:00:50+05:30 IST