251 గ్రామ వార్డు వలంటీర్ల భర్తీకి నోటిపికేషన్
ABN , First Publish Date - 2022-10-18T05:02:39+05:30 IST
జిల్లాలో 35 మండలాలు, 7 మున్సిపాలిటీల పరిధిలో ఖాళీగా ఉన్న 251 గ్రామ వార్డు వలంటీర్ల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జాయింట్ కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు.
జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ
కడప(కలెక్టరేట్), అక్టోబరు 17: జిల్లాలో 35 మండలాలు, 7 మున్సిపాలిటీల పరిధిలో ఖాళీగా ఉన్న 251 గ్రామ వార్డు వలంటీర్ల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జాయింట్ కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ గ్రామ వలంటీర్.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్ సైట్‌లో 18వ తేదీ లోగా వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. 21వ తేదీ పరిశీలన, 22న ఇంటర్వ్యూలు, 25న ఎంపికైన అభ్యర్థులకు కాల్ లెటర్లు, 27న శిక్షణా కార్యక్రమంతో పాటు 28న నియమాక ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందని ఆ ప్రకటనలో జేసీ పేర్కొన్నారు.