ఒక్క రాజధానికే దిక్కులేదు: టీడీపీ

ABN , First Publish Date - 2022-10-08T04:08:16+05:30 IST

ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందంట..అన్నట్లుగా మూడేళ్లు దాటినా ఒక్క రాజధాని నిర్మాణానికే దిక్కు లేదని, ఇక మూడు రాజధానులు కడతామని చెప్పడం హాస్యాస్పదమని టీడీపీ మండల నేతలు వైసీపీ నాయకులను విమర్శించారు.

ఒక్క రాజధానికే దిక్కులేదు: టీడీపీ
మాట్లాడుతున్న మండల కన్వీనర్‌ విజయభాస్కరరెడ్డి

చెన్నూరు, అక్టోబరు 7 : ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందంట..అన్నట్లుగా మూడేళ్లు దాటినా ఒక్క రాజధాని నిర్మాణానికే దిక్కు లేదని, ఇక మూడు రాజధానులు కడతామని చెప్పడం హాస్యాస్పదమని టీడీపీ మండల నేతలు వైసీపీ నాయకులను విమర్శించారు. శుక్రవారం స్థానిక చెన్నూరు టీడీపీ కార్యాలయంలో వారు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మండల కన్వీనర్‌ కె.విజయభాస్కర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన ఐ.శివారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మల్లిఖార్జునరెడ్డి, నియోజకవర్గ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఖాజాహుసేన మాట్లాడుతూ కడప మార్కెట్‌ కమిటీలో ఉన్న చెన్నూరును కమలాపురానికి మార్చడం వల్ల రైతులు పడ్డ ఇబ్బందులు గమనించారా అని ప్రశ్నించారు, చెన్నూరును కడప టూటౌన పరిధిలో నుంచి మార్చి యర్రగుంట్ల ఆ తరువాత కమలాపురానికి మార్చడం వల్ల ప్రజల ఇక్కట్లు గమనించారా అని అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి రాంప్రసాద్‌, కొండపేట సుధాకర్‌రెడ్డి, ఉండేలా బాలక్రిష్ణారెడ్డి, కొండాల చిన్నయ్య, లక్ష్మినారాయణ, సుదర్శన, పాలగిరి సుదర్శనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-08T04:08:16+05:30 IST