మిస్టరీ వీడని డ్రైవర్‌ సునీల్‌ అదృశ్యం కేసు

ABN , First Publish Date - 2022-09-19T05:57:24+05:30 IST

మండలంలోని గుట్టపాళెం గ్రామానికి చెందిన డ్రైవరు సునీల్‌కుమార్‌ (21) అదృ శ్యం కేసు చిక్కుముడి వీడ కుండా పోలీసులకు మిస్టరీ గా తయారయ్యింది.

మిస్టరీ వీడని డ్రైవర్‌ సునీల్‌ అదృశ్యం కేసు
గ్రామస్తులను విచారిస్తున్న కలికిరి ఎస్‌ఐ లోకేష్‌రెడ్డి



కలికిరి, సెప్టెంబరు 18: మండలంలోని గుట్టపాళెం గ్రామానికి చెందిన డ్రైవరు సునీల్‌కుమార్‌ (21) అదృ శ్యం కేసు చిక్కుముడి వీడ కుండా పోలీసులకు మిస్టరీ గా తయారయ్యింది. గత ఇరవై రోజుల క్రితం అనుమా నాస్పద రీతిలో అదృశ్యమైన సంగతి యువకుడి తండ్రి చిన్నయల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైన నాటి నుంచి ఇది అనుమానాస్పద అదృశ్య కేసుగానే పోలీసులు దర్యాప్తు సాగి స్తున్నారు. వారం రోజులపాటు సీఐ సురేష్‌ గ్రామంలో పలు అనుమా నాస్పద ప్రదేశాలను పరిశీలించి విచారణ చేపట్టారు. యువకుడిది హత్యగానే పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగానే దర్యాప్తు కూడా సాగుతోంది. తాజాగా ఆదివారం ఎస్‌ఐ లోకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు లు గ్రామంలో విచారణ జరిపారు. యువకుడితో బంధుత్వం, సన్ని హిత్వమున్న అన్ని ఇళ్లకూ వెళ్లి ఆయా కుటుంబీకుల నుంచి కూపీ లాగేందుకు ప్రయత్నాలు చేశారు. జంగంపల్లె సమీపంలోని ఒక వ్యవసాయ బావి గట్టున అదృశ్యమైన యువకుడికి సంబంధించిన పాదరక్షలు కనిపించాయి. దీంతో బావిలో మొత్తం నీరు తోడించి బావి అడుగు భాగం వరకూ శోధించారు. అయినా ఎలాంటి ఆనవాళ్ళు లభించలేదు. పోలీసులు తిరిగీ ఆదివారం అదే బావి పరిసరాల్లో గాలిం పు చేపట్టారు. పలువురు రైతులకు సంబంధించిన పొలాల్లోనూ ఆచూకీ కోసం ప్రయత్నించారు. ప్రస్తుతానికి ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదని, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఏఎస్‌ఐ మధుసూదనా చారి, పలువురు పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-19T05:57:24+05:30 IST