నేలమల్లేశ్వర స్వామి హుండీలు చోరీ
ABN , First Publish Date - 2022-05-15T05:27:54+05:30 IST
మండలం లోని తవళం అటవీ ప్రాంతంలో వెలసిన నేలమ ల్లేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి దొంగలు పడి హుండీలను దోచు కెళ్లినట్లు ఆలయ ఈవో ముని రాజ శనివారం స్థానిక పోలీసుల కు ఫిర్యాదు చేశారు.
ఆరు నెలల కాల వ్యవ ధిలో రెండో సారి..
నిమ్మనపల్లె, మే 14: మండలం లోని తవళం అటవీ ప్రాంతంలో వెలసిన నేలమ ల్లేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి దొంగలు పడి హుండీలను దోచు కెళ్లినట్లు ఆలయ ఈవో ముని రాజ శనివారం స్థానిక పోలీసుల కు ఫిర్యాదు చేశారు. ఈ సంద ర్బంగా ఆయన మాట్లాడుతూ ఆల యానికి భధ్రత లేని కారణంగా దొం గతనాలు జరుగుతున్నట్లు తెలి పా రు. అయితే ఆలయం లోపల వున్న సీసీ కెమరాలు 15 రోజులుగా పని చేయ కపోవడం దీనికి తోడు శుక్రవారం రాత్రి ఆలయానికి తాళాలు వేయకపోవడంతో పలు అనుమానాలకు దారి తీస్తుంది. శివరాత్రి ముగిసి కూడా 3నెలలు కా వస్తుండడంతో ఇంతవరకు హుం డీని లెక్కించలేదు. అందులో దాదాపు 1.50 లక్షల నగదు వుంటుందని భావిస్తున్నారు. ఇక్కడ కాపలాగా వున్న వాచ్‌మెన్, ఆలయానికి వచ్చిన దాదాపు 15 మంది స్వాములు ఆలయం వెలుపలనే ఉన్నప్పటికి చోరీ కావడం గమనార్హం. కేవలం 6నెలల క్రితం దొంగలు పడి సీసీ కెమరాలను ధ్వంసం చేసి హుండీని ఎత్తుకెళ్లారు. మరో సారి చోరీ జరగడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానిక సీఐ అశోక్‌కుమార్ తన క్లూస్‌టీంతో ఆలయం వద్దకు చేరుకుని చోరీకి గురైన హుండీలపై వున్న వేలిముద్రలను సేకరించారు. ఆయన మాట్లా డుతూ హుండీలను దొంగతనం చేసింది స్థానికులు గానే గుర్తించినట్లు తెలిపారు. అయితే శివరాత్రి అయిపోయి 3నెలలు కావస్తున్న ఇప్పటి వరకు హుండీని లెక్కించకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.