రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు నందిమండలం విద్యార్థులు

ABN , First Publish Date - 2022-12-16T23:15:41+05:30 IST

రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు నందిమండలం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్‌ఎం కళావతి, పీడీ రాజశేఖర్‌ తెలిపారు.

రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు నందిమండలం విద్యార్థులు
హ్యాండ్‌ బాల్‌ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

పెండ్లిమర్రి, డిసెంబరు 16: రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు నందిమండలం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్‌ఎం కళావతి, పీడీ రాజశేఖర్‌ తెలిపారు. అండర్‌-14 కేటగిరిలో అనంతపురం జిల్లా కదిరిలో ఈనెల 28,29, 30 తేదీల్లో జరిగే పోటీలకు హాజరవుతారన్నారు. వెంకటశ్రీరామ్‌, ఆదిశేషారెడ్డి, జయసింహారెడ్డి, వెంకటనరసింహ చరణ్‌, విష్ణువర్దన్‌, సాయికిరణ్‌, చైతన్య, బాలికలు కీర్తన, పల్లవి, ఉమామహేశ్వరి, జయశ్రీ, ప్రకాశం జిల్లాలోని దొనకొండలో జరిగే పోటీల్లో అండర్‌-17 బాలురు రహీం, విజయరాజు, పృనే్‌షకుమార్‌, బాలికలు బుజ్జి, శ్రీవిద్య ఎంపికయ్యారు. విద్యార్థులు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవడం సంతోషంగా ఉందన్నారు.

Updated Date - 2022-12-16T23:15:42+05:30 IST