మైలవరం ఉత్తరకాల్వకు గండి

ABN , First Publish Date - 2022-11-05T23:46:25+05:30 IST

మైల వరం ఉత్తర కాల్వకు నీటిని వదలడంతో చౌటపల్లె పొలం రాయల్‌ కౌంటి దగ్గర ఉత్తర కాల్వకు గండి పడింది.

మైలవరం ఉత్తరకాల్వకు గండి
కాల్వ నీళ్లు రావడంతో దెబ్బతిన్న పత్తి పంట - నిండుగా పారుతున్న మైలవరం ఉత్తర కాల్వ

పొలాలపై నీరు

దెబ్బతిన్న పంటలు

ఆందోళనలో రైతులు

ప్రొద్దుటూరు అర్బన్‌, నవంబరు 5: మైల వరం ఉత్తర కాల్వకు నీటిని వదలడంతో చౌటపల్లె పొలం రాయల్‌ కౌంటి దగ్గర ఉత్తర కాల్వకు గండి పడింది. దీంతో నీళ్లలన్నీ సమీప పొలాల్లోకి పోతున్నట్లు చౌటపల్లె రైతులు వాపోతున్నారు.జమ్మలమడుగులో పెన్నానదిపై కడుతున్న బ్రిడ్జి పనులకు ఆటంకం ఏర్పడకుండా మైలవ రం రిజర్వాయర్‌ నుంచి పెన్నానదిలోకి నీళ్లు విడుదల చేయకుండా మైలవరం ఉత్తర, దక్షిణ కాల్వలకు నీటిని విడుదల చేశారు. కాల్వల ద్వారా 200 నుంచి 300 క్యూసెక్కుల నీళ్లు వదలడంతో కాల్వలు నిండుగా పారుతున్నాయి.

ప్రొద్దుటూరు మండలంలో మైలవరం ఉత్తర కాలువ కింద వున్న ఆయకట్టు భూములన్నీ లేఅవుట్‌లుగా మారడం వలన ఈ నీళ్లు కాల్వ లో వృథాగా పోతున్నాయి. చౌటపల్లె దగ్గర వెళుతున్న ఉత్తర కాల్వకు గండి పడడం తో నీళ్లలన్నీ సమీప పొలాల్లోకి నీరు చేరు తున్నట్లు రైతులు వాపోతున్నారు. పత్తి పంట గింజ పగిలే సమయంలో ఈ నీళ్ళు పత్తి పంటకు పారడంతో పంట దెబ్బతింటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సమీప పొలాల్లో వేసిన నువ్వుల విత్తనం నీళ్ళు రావడంతో మొలకెత్తకుండానే కుళ్ళి పోతోందని రైతులు వాపోయారు. ఇరిగేషన్‌ అధికారులు కాల్వ గం డిని తక్షణం పూడ్చాలని పలువురు బాధి తులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2022-11-05T23:46:27+05:30 IST