రైతులతో సత్సంబంధాలు కలిగిఉండాలి: ఏవో

ABN , First Publish Date - 2022-05-24T05:10:44+05:30 IST

గ్రామసచివాలయాల్లో పనిచేస్తున్న వీఏఏలు రైతులకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో తెలియపరుస్తూ వారితో సత్సంబంధాలు కలిగిఉండాలని ఏవో జాఫర్‌షరీఫ్‌ పేర్కొన్నారు.

రైతులతో సత్సంబంధాలు కలిగిఉండాలి: ఏవో

కాశినాయన మే 23: గ్రామసచివాలయాల్లో పనిచేస్తున్న వీఏఏలు రైతులకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో తెలియపరుస్తూ వారితో సత్సంబంధాలు కలిగిఉండాలని ఏవో జాఫర్‌షరీఫ్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఓబుళాపురం రైతుభరోసా కేంద్రాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రైతులకు 50 శాతం సబ్సిడీతో పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలకు సంబంధించి రైతుల పేర్లు నమోదు జరుగుతోందన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు.

Updated Date - 2022-05-24T05:10:44+05:30 IST