పీలేరులో పీర్ల పండుగ వేడుకలు

ABN , First Publish Date - 2022-08-10T05:15:12+05:30 IST

పవిత్ర మొహర్రం మాసం 10వ రోజు సంద ర్భంగా పీలేరులోని పెద్దపీర్ల చావిడి వద్ద పీర్ల పండుగను మంగ ళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

పీలేరులో పీర్ల పండుగ వేడుకలు
పీలేరు వీధుల్లో ఊరేగుతున్న పీర్లు

పీలేరు, ఆగస్టు 9: పవిత్ర మొహర్రం మాసం 10వ రోజు సంద ర్భంగా పీలేరులోని పెద్దపీర్ల చావిడి వద్ద పీర్ల పండుగను మంగ ళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కరోనా కారణం గా ఉత్సవాలకు దూరమైన పీర్లను ఈ ఏడాది పీలేరు, బోడుమ ల్లువారిపల్లెల్లోని పీర్ల చావిళ్లలోని ప్రతిష్టించిన ముజావర్లు వారం రోజులుగా వాటికి పూజలు నిర్వహించారు. 10వ రోజైన మంగళ వారం సాంప్రదాయబద్ధంగా గ్రామోత్సవంలా ఊరేగుతూ పీలేరు పెద్దపీర్ల చావిడిలోని పీర్లతో మమేకమయ్యాయి. ఈ సందర్భంగా బోడుమల్లువారిపల్లె గ్రామస్థులతోపాటు పీర్ల ఊరేగింపు జరిగిన కోటిగారిపల్లె, యల్లమంద క్రాసు, క్రాసురోడ్లు, ఎల్‌బీఎస్‌ రోడ్డు, నెహ్రూబజారు, గాంధీరోడ్డు, బ్రాహ్మణవీధుల్లోని ప్రజలు కుల, మతాలకు అతీతంగా పీర్లను పూజించుకున్నారు. దారి పొడవునా వాటికి ఎదురేగి చదివింపులు జరిపారు. చాలా మంది తమ మొక్కులు తీర్చుకున్నారు. పీలేరు పెద్దపీర్ల చావిడిలో కొలువైన పీర్లను స్థానికంగా ఉన్న అనేక మంది హిందువులు దర్శించుకుని పూజలు జరిపారు. పీలేరు, బోడుమల్లువారిపల్లె పీర్లను ఉత్స వాల అనంతరం స్థానిక అయ్యపనాయుని చెరువులో శాస్ర్తోక్తం గా శుభ్రపరిచి ఇళ్లకు చేర్చారు. పీర్ల పండుగ సందర్భంగా పెద్దపీర్ల చావిడి వద్ద యువకుల కేరింతలు, ఆటపాటలతో కోలాహల వాతావరణం నెలకొంది. బోడుమల్లువారిపల్లె పీర్లను సర్పంచ్‌ అమరనాథరెడ్డి కుటుంబీకులు ప్రత్యేక పూజలు జరిపా రు. పీలేరులోని ప్రముఖ అర్చకులు రవిస్వామి పీర్ల పల్లకీలకు చదివింపులు నిర్వహించారు. హిందూ-ముస్లింల ఐక్యతను పీర్ల పండుగ మరోమారు చాటింది. 

Updated Date - 2022-08-10T05:15:12+05:30 IST