ప్రిన్సిపాల్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2022-08-05T04:56:09+05:30 IST
పిల్లలతో ఇంట్లో పనిచేయించుకుం టున్న ప్రిన్సిపాల్ సుభద్రపై అధికా రులు చర్యలు తీసుకోవాలని కోరు తూ మెరుగు గంగోత్రి తల్లిదండ్రు లు సుబ్బరాయుడు, సువర్ణ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టా రు.
ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా
అధికారులు న్యాయం చేయాలని విజ్ఞప్తి
జమ్మలమడుగు రూరల్, ఆగస్టు 4: పిల్లలతో ఇంట్లో పనిచేయించుకుం టున్న ప్రిన్సిపాల్ సుభద్రపై అధికా రులు చర్యలు తీసుకోవాలని కోరు తూ మెరుగు గంగోత్రి తల్లిదండ్రు లు సుబ్బరాయుడు, సువర్ణ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టా రు. అనంతరం బాధితులు విలేకరు లతో మాట్లాడుతూ పెద్దముడియం మండలం గుండ్లకుంటలోని బాల యోగి గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతుండగా ప్రిన్సిపాల్ సుభద్ర ఇంట్లో పనిచేయించుకునేద ని ఆరోపించారు. ప్రిన్సిపాల్ ఇంట్లో బట్టలుతకడం, ఇండ్లు శుభ్రం చేయడం తదితర సేవ లు చేయించుకునేదన్నారు.
తమకు తెలియదని, తమ బిడ్డ సెలవుల్లో ఇంటికి వచ్చి చెప్పిందన్నారు. సెలవుల అనంతరం పాఠశాలలో దించేందుకు పాఠశాల వద్దకు వెళ్లామన్నారు. దీంతో మీరు ఎవరు వచ్చేదని విద్యార్థిని తండ్రి అని గ్యారెంటీ ఏంటి అని దుర్భాషలాడిందన్నారు. ఈ విషయంపై జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులుకు సమస్యను తెలిపి వినతి పత్రం అందించామన్నారు. అదే రోజు ఆర్డీఓ ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసి మరోసారి ఇలాంటి పని చేయరాదని సూచించారన్నారు. అయినా ఆమెలో మార్పు రాలేదని వివరించారు. పాఠశాలకు వద్దకు వెళ్లగా 6వ తరగతి పూర్తి అయినట్లు సర్టిఫికెట్, మరోపాఠశాలలో చేర్పిం చేందుకు టీసీ ఇవ్వాలని కోరామన్నారు. దీంతో తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారా అంటూ 6వ తరగతి డిస్కంటి న్యూ సర్టిఫికెట్ ఇస్తానని బెదిరించిందన్నారు. చేసేది లేక తాము మూడు రోజుల కిం దట ఎస్పీ అన్బురాజన్‌ను తా ము కలిసి ఫిర్యాదు చేశామన్నా రు. అయినా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చే శారు. గురువారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట పోరాటానికి దిగి నట్లు తెలిపారు. నిర్లక్ష్యంగా, చిన్నచూపు చూసి దుర్భాషలాడి న ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని, తన బిడ్డకు చదువుకునే యోగం కల్పించాలని, 6వ తరగతి పూర్తి చేసినట్లు, టీసీ ఇప్పించాలని వా రు కోరారు.
అనంతరం ఆర్డీఓ కార్యాలయంలోని ఏఓ ఇక్బాల్‌కు వినతి పత్రం అందజేశారు. ఈవిషయమై ప్రిన్సిపాల్ సుభద్రను వివరణ కోరగా ఆ అమ్మాయి పాఠశాలకు సరిగా రాదని, అలాంటి అమ్మాయి మా ఇం ట్లో ఎలాగ పనులు చేసేందుకు వస్తుందని వివరించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు ఆంజనేయులు, పుష్పరాజు, ఎన్.యువరాజు, కె.సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.