అమ్మఒడిపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు సరికాదు

ABN , First Publish Date - 2022-03-06T04:52:33+05:30 IST

ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు అమ్మఒడి అవసరం లేదని మైదుకూరు శాసన సభ్యుడు రఘురామిరెడ్డి వ్యాఖ్యలు సరికాదని కడప జిల్లా గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం జిల్లా అధ్యక్షుడు బీఎస్‌ రమణారెడ్డి అన్నారు.

అమ్మఒడిపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు సరికాదు

వేంపల్లె, మార్చి 5: ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు అమ్మఒడి అవసరం లేదని మైదుకూరు శాసన సభ్యుడు రఘురామిరెడ్డి వ్యాఖ్యలు సరికాదని కడప జిల్లా గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం జిల్లా అధ్యక్షుడు బీఎస్‌ రమణారెడ్డి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రైవేట్‌ పాఠశాలల్లో కూడా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన పేద, మధ్యతరగతి పిల్లలు ఉన్నారనే  ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలందరు ధనవంతులు కాదని  ఇటువంటి ప్రకటనలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-03-06T04:52:33+05:30 IST