విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలి

ABN , First Publish Date - 2022-10-18T04:45:08+05:30 IST

విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలని డిప్యూటీ డీఈవో వాల్మీకి నాగరాజు తెలిపారు.

విద్యార్థుల్లో  కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలి
మాట్లాడుతున్న డిప్యూటీ డీఈవో వాల్మీకి నాగరాజు

ప్రొద్దుటూరు టౌన్‌, అక్టోబరు 17 : విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలని డిప్యూటీ డీఈవో వాల్మీకి నాగరాజు తెలిపారు. సోమవారం అనిబిసెంట్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ లో ప్రొద్దుటూరు, చాపాడు మండలాల ఉపాధ్యాయుల కు టీఏఆర్‌ఎల్‌పై నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కరోనా సమయంలో 1, 2 తరగ తుల విద్యార్థులకు ఎటువంటి తరగతులు నిర్వి హంచలేదన్నారు. వారు 3, 4 తరగతులకు వచ్చిన తర్వాత ఆ తరగతుల స్థాయి అభ్యసన సామ ర్థ్యాలను ప్రదర్శించలేకపోతున్నారని తెలి పారు. వారిలో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించ డానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ్‌ ఫౌండేషన్‌ ఆధ్వ ర్యంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసిందన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఉపాధ్యా యులు విద్యార్థులకు నేర్పించాలని సూచించారు. కార్యక్ర మంలో ఇన్‌చార్జి ఎంఈవో రవిశంకర్‌, రీసోర్స్‌ పర్సన్‌లు నరేష్‌, మధు, భాస్కర్‌, సుబ్బరాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

కాశినాయన:  టీఆర్‌ఏఎల్‌ లెవెల్‌ 1 శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని నర్సాపురం స్కూల్‌ కాంప్లెక్స్‌ చైర్మన్‌, కోర్సు డైరెక్టర్‌ సుభాషిణి కోరారు. సోమవారం నర్సాపురంలో ఉ పాధ్యాయులకు 4 రోజుల ప్రత్యేక శిక్షణను ఆమె ప్రారంభించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న విషయాలను తరగతిగదిలో అన్వయించి విద్యార్థుల పురోగతికి పాటుపడా లన్నారు. ఈ శిక్షణలో ఆర్పీలుగా రమణారెడ్డ్డి, ప్రసాద్‌, సుబ్రమణ్య, యాసిన్‌ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీ రాజు, రవి పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-18T04:45:08+05:30 IST