ఆరోగ్యశ్రీలో ఉద్యోగాలకు మెరిట్ జాబితా
ABN , First Publish Date - 2022-08-05T05:27:58+05:30 IST
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టులో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆరోగ్యమిత్రలు, టీం లీడర్ల పోస్టులకు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితాను కడప ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఉంచామని జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రఘు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
నేడు కౌన్సెలింగ్
కడప(కలెక్టరేట్), ఆగస్టు 4: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టులో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆరోగ్యమిత్రలు, టీం లీడర్ల పోస్టులకు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితాను కడప ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఉంచామని జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రఘు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ స్కిల్స్ టెస్ట్, ఇంటర్వ్యూలకు శుక్రవారం ఉదయం 9-30 గంటలకు కడప ఉక్కాయ పల్లిలోని శ్రీ శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కేంద్రం వద్దకు హాజరు కావాలని కోరారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ పరిధిలోని ఆర్టీపీసీఆర్ ల్యాబొరేటరీ (కొవిడ్-19)లో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న ల్యాబ్ టెక్నిషీయన్ల మెరిట్ లిస్ట్‌ను కడప ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఉంచామని డీంఅండ్ హెచ్ ఓ డాక్టర్ నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు శుక్ర వారం ఉదయం 10-30 గంటలకు డీఎంఅండ్ హెచ్ ఓ కార్యాలయంలో జరిగే కౌన్సెలింగ్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.