హాస్టల్‌ విద్యార్థులకు వైద్య పరీక్షలు

ABN , First Publish Date - 2022-12-12T23:43:03+05:30 IST

సాంఘిక సంక్షేమ బాలుర వసతిగృహాలు 1, 2 బీసీ హాస్టల్‌ , కళాశాల హాస్టల్‌ విద్యార్థులకు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ చంద్రహాసరెడ్డి పర్యవేక్షణలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

హాస్టల్‌ విద్యార్థులకు వైద్య పరీక్షలు

బద్వేలు, డిసెంబరు 12: సాంఘిక సంక్షేమ బాలుర వసతిగృహాలు 1, 2 బీసీ హాస్టల్‌ , కళాశాల హాస్టల్‌ విద్యార్థులకు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ చంద్రహాసరెడ్డి పర్యవేక్షణలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు ఎత్తు, బరువు, రక్తహీనత , అలర్జీ వ్యాధులకు రక్తనమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి చికిత్స చేసి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, బాలుర హాస్టల్‌ 1 వార్డన్‌ సుభాష్‌ చంద్ర, హాస్టల్‌ 2 వార్డన్‌ మధుసూధన్‌రెడ్డి బాలికల హాస్టల్‌వార్డన్లు లక్ష్మీదేవి, బాలమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T23:43:21+05:30 IST

Read more