మల్లయ్యకొండకు రూ.17.96 లక్షల ఆదాయం

ABN , First Publish Date - 2022-12-15T23:16:08+05:30 IST

మల్లయ్యకొండ ఆలయ ఆదాయం ఏడాదికేడాది పెరుగుతోంది. గత ఏడాది వేలం పాటల ద్వారా మల్లయ్యకొండ ఆలయానికి రూ.4,75,700 ఆదాయం రాగా ఈ ఏడాది రూ.17.96 లక్షల ఆదాయం వచ్చింది.

మల్లయ్యకొండకు రూ.17.96 లక్షల ఆదాయం
: బహిరంగ వేలం పాటలు నిర్వహిస్తున్న దేవదాయ శాఖాధికారులు

గత ఏడాది కంటే భారీగా పెరుగుదల

తంబళ్లపల్లె, డిసెంబరు 15: మల్లయ్యకొండ ఆలయ ఆదాయం ఏడాదికేడాది పెరుగుతోంది. గత ఏడాది వేలం పాటల ద్వారా మల్లయ్యకొండ ఆలయానికి రూ.4,75,700 ఆదాయం రాగా ఈ ఏడాది రూ.17.96 లక్షల ఆదాయం వచ్చింది. తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్యకొండలో మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఏడాది పాటు వివిధ హక్కులను పొందేందుకు గురువారం ఆలయ ఇన్‌స్పెక్టర్‌ శశికుమార్‌, ఈవో మునిరాజ, చైర్మన్‌ కేఆర్‌ మల్‌రెడ్డి ఆధ్వర్యంలో మద్దాభక్తునిబావి వద్ద బహిరంగ వేలం పాటలు నిర్వహించారు. తలనీలాలకు కె.శ్రీనివాసులు రూ.3.10 లక్షలు, లడ్డూ ప్రసాదం విక్రయ హక్కు కె.మోహన రూ.4.31 లక్షలు, టోల్‌గేట్‌కు బి.బాలచంద్ర రూ.5.50 లక్షలు, వీటితో పాటు కొండలోని వివిఽధ ఆలయాల పూజా సామగ్రి, కొబ్బరి చిప్పలు సేకరించడం, పాదరక్షలకు వేలం పాటలు నిర్వహించారు. వీటి ద్వారా 5.05 లక్షల వచ్చింది. కార్యక్రమంలో తంబళ్లపల్లె సర్పంచ్‌లు నీలూఫర్‌ మైనుద్దీన్‌, పార్వతమ్మ శ్రీనివాసులు, వైస్‌ ఎంపీపీ కరీం, ఆలయ పాలక మండలి సభ్యులు, సిబ్బంది కొండకిట్ట, ఈశ్వరయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:16:10+05:30 IST