ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి మలిదశ పోరాటానికి సిద్ధం: సీపీఐ

ABN , First Publish Date - 2022-12-02T00:09:28+05:30 IST

కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి మలిదశ పోరాటానికి సిద్ధమని, ఈ కార్యక్రమాన్ని ఈ నెల 9 నుంచి 13 వరకు నిర్వహించనున్నామని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తెలిపారు.

ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి మలిదశ పోరాటానికి సిద్ధం: సీపీఐ

కమలాపురం రూరల్‌, డిసెంబరు 1: కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి మలిదశ పోరాటానికి సిద్ధమని, ఈ కార్యక్రమాన్ని ఈ నెల 9 నుంచి 13 వరకు నిర్వహించనున్నామని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తెలిపారు. గురువారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పాదయాత్ర వాల్‌పోస్టర్‌ను వారు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కరువు, వలసలతో విలవిల్లాడుతున్న కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని 2011 నుంచి సీపీఐ ఆధ్వర్యంలో డిమాండ్‌ చేస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన హక్కు చట్టంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన పొందుపరచడానికి సీపీఐ పోరాట మే కారణమన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఈ నెల 9 నుంచి 13 వరకు కన్నెతీర్థం నుంచి కడప వరకు పాదయాత్ర నిర్వహించనున్నామని, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ పార్లమెంటు సభ్యుడు బినయ్‌ విశ్వం, జాతీయ కార్యదర్శి కె.నారాయణ పాదయాత్రలో పాల్గొంటారన్నారు. కావున ఈ పాదయాత్రలో యువకులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఏరియా కార్యదర్శి నాగేశ్వర్‌రావు, ఈశ్వరయ్య, ఏరియా కార్యవర్గ సభ్యులు వెంకటరమణ, మనోహర్‌రెడ్డి, పవనకుమార్‌, వరలక్ష్మి, వర ప్రసాద్‌, అమ్ములు, గంగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T00:09:32+05:30 IST