‘జగనన్న ఇళ్లు..పేదలకు కన్నీళ్లు’ ఉద్యమాన్ని జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2022-11-11T22:51:16+05:30 IST

జగనన్న ఇళ్లు.. పేదలకు కన్నీళ్లు అనే నినాదంతో ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు జనసేన రాయలసీమ కో- కన్వీనర్‌ గంగారపు రాందాస్‌చౌదరి తెలిపారు.

‘జగనన్న ఇళ్లు..పేదలకు కన్నీళ్లు’ ఉద్యమాన్ని జయప్రదం చేయండి
మాట్లాడుతున్న గంగారపు రాందాస్‌చౌదరి

మదనపల్లె క్రైం, నవంబరు 11: జగనన్న ఇళ్లు.. పేదలకు కన్నీళ్లు అనే నినాదంతో ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు జనసేన రాయలసీమ కో- కన్వీనర్‌ గంగారపు రాందాస్‌చౌదరి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ జగనన్న కాలనీల్లో సుమారు 25 లక్షల ఇళ్లు ఇస్తామని సీఎం జగనరెడ్డి చెప్పారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. టిడ్కో ఇళ్లు, జగ నన్న కాలనీలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈనెల 12 నుంచి 14వ తేదీవరకు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జగన కాలనీల నిర్మా ణంపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్‌ విసిరా రు. జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జంగా ల శివరాం మాట్లాడుతూ జగన కాలనీల్లో ఎ లాంటి మౌలిక వసతులు లేవన్నారు. భూము లు సేకరించిన రైతులకు ఇంకా పరిహారం చెల్లించలేదని మండిపడ్డారు. జగన ప్రభుత్వా న్ని నిలదీసేందుకే ఉద్యమాన్ని నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అడపా సురేంద్ర, అమరనారాయణ, గ్రానైట్‌ బాబు, నాగరాజు, రెడ్డెమ్మ, పద్మావతి, నాగవేణి, రేణుక, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-11T22:51:20+05:30 IST