విద్యార్థుల హాజరు శాతం తగ్గకుండా చూడండి

ABN , First Publish Date - 2022-08-17T04:47:56+05:30 IST

ప్రభుత్వ పాఠశా లల్లో విద్యార్థుల హాజరు శాతం తగ్గకుం డా చూడాలని మదనపల్లె జిల్లా ఉప విద్యాశాఖాధికారి(డిప్యూటి డిస్ర్టిక్ట్‌ ఎడ్యుకే షనల్‌ ఆఫీసర్‌) క్రిష్ణప్ప పేర్కొన్నారు.

విద్యార్థుల హాజరు శాతం తగ్గకుండా చూడండి
మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేస్తున్న డీవైఈవో క్రిష్ణప్ప

నిమ్మనపల్లె, ఆగస్టు 16: ప్రభుత్వ పాఠశా లల్లో విద్యార్థుల హాజరు శాతం తగ్గకుం డా చూడాలని  మదనపల్లె జిల్లా ఉప విద్యాశాఖాధికారి(డిప్యూటి డిస్ర్టిక్ట్‌ ఎడ్యుకే షనల్‌ ఆఫీసర్‌) క్రిష్ణప్ప పేర్కొన్నారు. మండలంలోని బాలినాయునిపల్లె జడ్పీ హైస్కూల్‌, నిమ్మనపల్లె జడ్పీహైస్కూల్‌ల్లో మంగళవారం  ఆయన తనిఖీలు నిర్వ హిం చారు. ఈ సందర్బంగా ఆయన మధ్యాహ్న భోజనాన్ని తనిఖీలు చేసి నాడు-నేడు పనులను పరిశీలించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలిసుకొని అక్కడే భోజనం చేశారు. అనంతరం ఉపా ధ్యాయులతో సమావేశం నిర్వహించి ఉపాధ్యాయులు తప్పనిసరిగా బయోమెట్రిక్‌ను వినియోగించుకోవాలన్నారు.  తాగునీరు, ఆర్వో ప్లాంట్లను పరిశీలించారు.  పాఠ్యపుస్త కాలు, నోట్‌బుక్కులు, యూనిఫామ్‌ అందాయా లేదా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.  కార్యక్రమంలో హెచ్‌ఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-17T04:47:56+05:30 IST