-
-
Home » Andhra Pradesh » Kadapa » Majority of the village leaders are responsible at the booth level-MRGS-AndhraPradesh
-
బూత్ స్థాయిలో మెజారిటీ గ్రామ నేతలదే బాధ్యత
ABN , First Publish Date - 2022-09-09T05:05:03+05:30 IST
గ్రామాల్లో పోలింగ్ కేంద్రం స్థాయిలో టీడీపీ కి మెజారిటీ తెప్పించే బాధ్యత పూర్తిగా బూత్ స్థాయి కోఆర్డినే టర్లదే నని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమా ర్‌రెడ్డి స్పష్టం చేశారు.

కలికిరి, సెప్టెంబరు 8: గ్రామాల్లో పోలింగ్ కేంద్రం స్థాయిలో టీడీపీ కి మెజారిటీ తెప్పించే బాధ్యత పూర్తిగా బూత్ స్థాయి కోఆర్డినే టర్లదే నని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమా ర్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువా రం స్థానిక అమరనాథ రెడ్డి భవన్‌లో నిర్వహించిన మండ లంలోని క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ కోఆర్డినేటర్లతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రంలోని ఓటర్లతో మమేకం కావాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో మెజారిటీ సాధించిన వారికే అన్ని విధాల ప్రాధా న్యత ఉంటుందని, పార్టీ కూడా వారికే అన్ని విధాలా ప్రోత్సాహమిస్తుందని తెలిపా రు. పార్టీ సభ్యత్వ నమోదులో గ్రామ స్థాయిలో కలిసికట్టుగా కృషి చేసి మంచి ఫలి తాలు సాధించారని కిశోర్‌కుమార్ రెడ్డి ప్రశంసించారు. కొన్ని చోట్ల వంద శాతం సభ్యత్వ నమోదును పూర్తి చేశారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండల టీడీపీ అధ్యక్షుడు నిజాముద్దీన్, పలువురు అనుబంధ విభాగాల నాయకులతోపాటు క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ బృందాలు హాజరయ్యారు.