మహాలక్ష్మీ.. నమోస్తుతే

ABN , First Publish Date - 2022-10-02T04:32:24+05:30 IST

దసరా ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. విద్యుత్‌ కాంతులతో ఆలయాలు వెలుగొందుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. భక్తులు పెద్దసంఖ్యలో హాజరవుతుండడంతో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

మహాలక్ష్మీ.. నమోస్తుతే
రాయచోటి వీరభద్రాలయంలో మహాలక్ష్మిదేవి అలంకారంలో అమ్మవారు

రాయచోటి/రాజంపేట/ఒంటిమిట్ట/గుర్రంకొండ, అక్టోబరు 1: దసరా ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. విద్యుత్‌ కాంతులతో ఆలయాలు వెలుగొందుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. భక్తులు పెద్దసంఖ్యలో హాజరవుతుండడంతో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన శనివారం రాయచోటి వీరభద్రా లయంలో భద్రకాళీ అమ్మవారు మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. ఒంటిమి ట్టలో త్రిపుర సుందరీదేవిగా వాసవీమాత కరుణించారు. అలాగే గుర్రంకొం డలోని రెడ్డెమ్మ ఆలయంలో మహాలక్ష్మీగా, రాజంపేటలోని శ్రీమత్కన్యకా ప రమేశ్వరి ఆలయంలో మీనాక్షిదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. 
Read more