బీజేపీ అంతం.. మాదిగల పంతం!

ABN , First Publish Date - 2022-08-10T04:54:47+05:30 IST

బీజేపీ అంతం మాదిగల పంతం అని ఎమ్మార్పీఎస్‌ జిల్లా కోకన్వీనర్‌ ఆర్‌.శ్రీనివాసులు మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు చిన్నయ్య ప్రకటించారు.

బీజేపీ అంతం.. మాదిగల పంతం!
రిలే దీక్ష చేస్తున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

జమ్మలమడుగు రూరల్‌, ఆగస్టు 9: బీజేపీ అంతం మాదిగల పంతం అని   ఎమ్మార్పీఎస్‌  జిల్లా కోకన్వీనర్‌ ఆర్‌.శ్రీనివాసులు మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు చిన్నయ్య ప్రకటించారు. 20 రోజులుగా స్థానిక తహసీల్దారు కార్యాలయ ఆవరణలో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే దీక్షలు మంగళవారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 రోజులుగా దీక్ష చేస్తున్నా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మారమన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పిన బీజేపీ ఏళ్లు గడుస్తున్నా, హామీ అమలు చేయకుండా మోసం చేసిందన్నారు.  బీజేపీ అంతం కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా 10వ తేదీన జమ్మలమడుగు పట్టణంలో నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ముగియడంతో  దీక్షలను విరమించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు నరసింహులు, బ్రహ్మయ్య, నాగరాజు, పుల్లన్న, ఓబులేసు, గురుశేఖర్‌, సీపీఐ నాయకులు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T04:54:47+05:30 IST