ఉర్దూను పటిష్టంగా అమలు చేయాలి: రూటా

ABN , First Publish Date - 2022-12-02T00:05:29+05:30 IST

రాష్ట్ర రెండో అధికార భాష ఉర్దూను పటిష్టంగా అమలు చేయాలని రూటా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ ఇక్బాల్‌ డిమాండ్‌ చేశారు.

ఉర్దూను పటిష్టంగా అమలు చేయాలి: రూటా

కడప (ఎడ్యుకేషన), డిసెంబరు 1: రాష్ట్ర రెండో అధికార భాష ఉర్దూను పటిష్టంగా అమలు చేయాలని రూటా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ ఇక్బాల్‌ డిమాండ్‌ చేశారు. కడప నగరం రూటా కార్యాలయంలో గురువారం రూటా సంఘం ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇంగ్లీషు, తెలుగు మీడియం ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉర్దూ భాష ఉపాధ్యాయులను నియమించాలన్నారు. రూటా వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్‌ హిదయతుల్లా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉర్దూ పాఠశాల, కళాశాల్లోని ఉపాధ్యాయ, అధ్యాపక ఖాళీలను కడప యోగివేమన, కర్నూలు డాక్టర్‌ అబ్దుల్‌హక్‌ విశ్వవిద్యాలయాల్లో ఉర్దూ అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రూటా రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు షాహిదుల్లా, సత్తార్‌ఫైజి, అబ్దుల్‌ హకీం, సయ్యద్‌ సిరాజుద్దీనతో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T00:05:33+05:30 IST