లారీ, ఆటో ఢీ - వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-10-08T04:58:54+05:30 IST

కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిలో మండల కేంద్ర మైన రామాపురం భారత్‌ పెట్రోల్‌ బంకు వద్ద శుక్రవా రం రాత్రి ఆటో, లారీ ఢీకొన్న సంఘటనలో ఆటో డ్రైవర్‌ సుధాకర్‌ (38) అక్కడికక్కడే మృతి చెందాడు.

లారీ, ఆటో ఢీ - వ్యక్తి మృతి

రామాపురం, అక్టోబరు 7: కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిలో  మండల కేంద్ర మైన రామాపురం భారత్‌ పెట్రోల్‌ బంకు వద్ద శుక్రవా రం రాత్రి ఆటో, లారీ ఢీకొన్న సంఘటనలో ఆటో డ్రైవర్‌ సుధాకర్‌ (38) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని నల్లగు ట్టపల్లె పంచాయతీ దళితవాడకు చెందిన సుధాకర్‌ రామాపురం నుంచి ఆటోలో స్వగ్రామానికి వెళ్తుండగా పెట్రోల్‌ బంకు సమీపానికి రాగానే రాయచోటి వైపు నుంచి కడప వైపు వెళ్తున్న లారీ, ఆటోను ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న సుధాకర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి ఎస్‌ఐ జయరాములు, సిబ్బంది చేరుకుని పరిశీలించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తర లించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  

Updated Date - 2022-10-08T04:58:54+05:30 IST