రాష్ట్ర భవిష్యత్తు కోసమే లోకేశ పాదయాత్ర
ABN , First Publish Date - 2022-12-31T23:14:48+05:30 IST
రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ యువగళం పేరుతో పాదయాత్ర చేయనున్నారని తంబళ్లపల్లె టీడీపీ మండలాఽధ్యక్షుడు రెడ్డెప్పరెడ్డి పేర్కొన్నారు.
తంబళ్లపల్లె, డిసెంబరు 31: రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ యువగళం పేరుతో పాదయాత్ర చేయనున్నారని తంబళ్లపల్లె టీడీపీ మండలాఽధ్యక్షుడు రెడ్డెప్పరెడ్డి పేర్కొన్నారు. పాదయాత్రకు సంఘీభావం గా టీడీపీ నాయకులు, క్యాకర్తలు శనివారం స్థానిక హరిత కూడలి వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లె మండలంలో లోకేశ పాదయాత్ర ఎప్పు డు జరిగినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రామచంద్ర, మాజీ ఎంపీ టీసీ చలపతినాయుడు, రెడ్డెప్ప, తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు.