తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌

ABN , First Publish Date - 2022-12-13T23:42:03+05:30 IST

జల్సాలకు అలవాటు పడి, తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌ చేసుకుని రెక్కీ నిర్వహించి చోరీ చేస్తున్న మెరుగు బాబును అరెస్టు చేశారని ఎస్పీ అన్బురాజ న్‌ పేర్కొన్నారు. ఇతనిపై జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో 12 కేసులు నమోదు చేశారని, అరెస్టు అయిన బాబు నుంచి రూ.6.50లక్షలు విలువైన 14 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన ప్రకటించారు.

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌
నిందితుని వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ

దొంగతనాలు చేస్తున్న వ్యక్తి అరెస్టు

రూ.6.50 లక్షల విలువైన నగలు స్వాధీనం

పీడీ యాక్టు నమోదు చేసిన ఎస్పీ

కడప (క్రైం), డిసెంబరు 13: జల్సాలకు అలవాటు పడి, తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌ చేసుకుని రెక్కీ నిర్వహించి చోరీ చేస్తున్న మెరుగు బాబును అరెస్టు చేశారని ఎస్పీ అన్బురాజ న్‌ పేర్కొన్నారు. ఇతనిపై జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో 12 కేసులు నమోదు చేశారని, అరెస్టు అయిన బాబు నుంచి రూ.6.50లక్షలు విలువైన 14 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన ప్రకటించారు. మంగళవారం తన కార్యాలయంలో అడిషనల్‌ ఎస్పీ తుషార్‌ డూడి, డీఎస్పీ బి.వెంకటశివారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఎస్పీ వెల్లడించిన వివరాల్లోకెళితే....

జమ్మలమడుగు మండలం, గూడెంచెరువు గ్రామం, రాజీవ్‌నగర్‌ కాలనీ వాసి మెరుగు బాబు బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదనకు అల వాటు పడిన ఇతను దొంగతనాలు చేసేందుకు పూనుకున్నా డు. రెక్కీ నిర్వహించి తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లోకి రాత్రిళ్లు దూరి డబ్బు, బంగారు నగలు దోచుకెళ్లేవాడు. గత నెల 21న సిద్దవటం మండలం, మాధవరం-1 పార్వతీపురంలో ఒక ఇంట్లో రూ.30వేలు విలువైన బంగారు వస్తువులు దొంగించాడని సిద్దవటం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైందన్నారు. నవంబరు 19న కడప టౌన్‌ మరాటివీధిలో ఒక ఇంట్లో, 29న ఖాజీపేట మండలం, సుంకేసులపల్లెలో ఓ ఇంట్లో బంగారు వస్తువులు దొంగలించినట్లు ఖాజీపేట పీఎ్‌సలో కేసు నమోదైందన్నారు.

దీనిపై దర్యాప్తును ముమ్మరం చేశామన్నారు. మంగళవారం అందిన సమాచారం మేరకు సిద్దవటం ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి భాకరాపేటలోని కడప - రాజంపేట ప్రధాన రహదారిపై గంగమ్మ గుడి వద్ద మెరుగు బాబును అరెస్టు చేశామన్నారు. ఇతని వద్ద నుంచి సుమారు రూ.6.50 లక్షలు విలువైన మొత్తం 14 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇతనిపై జమ్మలమడుగు పోలీసుస్టేషన్‌లో 3 కేసులు, ఎర్రగుంట్ల పీఎ్‌సలో 3 కేసులు, ప్రొద్దుటూ రు రూరల్‌ పీఎ్‌సలో 1 కేసు, నంద్యాల జిల్లా నం ద్యాల పోలీసుస్టేషన్‌లో 2 కేసులు ఉన్నాయన్నారు. ఇతనిపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

అభినందించిన ఎస్పీ

కేసును చేధించి నిందితుని పట్టుకుని, సొత్తు రికవరీ చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన కడప డీఎస్పీ బి.వెంకటశివారెడ్డి, ఒంటిమిట్ట సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ పురుషోత్తం, సిద ్దవటం ఎస్‌ఐ పి.తులసి నాగ ప్రసాద్‌, పోలీసు సిబ్బంది, క్రైం పార్టీ సిబ్బంది శ్రీను, ప్రసాద్‌, బాషా, చంద్రారెడ్డి, ఖాదర్‌, చంద్ర నారాయణరెడ్డిని ఎస్పీ అభినందించారు.

Updated Date - 2022-12-13T23:42:04+05:30 IST