మహాత్ముడి అడుగుజాడల్లో నడుద్దాం

ABN , First Publish Date - 2022-10-03T05:39:49+05:30 IST

శాంతినే ఆయుధం గా చేసుకుని స్వాతంత్య్రం సాధించిన మహాత్మాగాంధీజీ అడుగు జాడల్లో నడుద్దామని ఆర్డీవో ఎంఎస్‌ మురళి పేర్కొన్నారు.

మహాత్ముడి అడుగుజాడల్లో నడుద్దాం
మదనపల్లెలో గాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఆర్డీవో ఎంఎస్‌ మురళి

మదనపల్లె టౌన్‌/ రూరల్‌/అర్బన్‌, అక్టోబరు 2: శాంతినే ఆయుధం గా చేసుకుని స్వాతంత్య్రం సాధించిన మహాత్మాగాంధీజీ అడుగు జాడల్లో నడుద్దామని ఆర్డీవో ఎంఎస్‌ మురళి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో గాంధీ విగ్రహానికి సబ్‌కలెక్టరేట్‌ ఉద్యోగులు పూలమాల వేసి  ఘనంగా నివాళు లర్పించారు. అలాగే మున్సిపల్‌ కార్యాలయం వద్ద చైర్‌పర్సన్‌ మనూజ, వైస్‌చైర్మన్‌ జింకా వెంకటా చలపతి, ఏపీఎండీసీ చైర్‌పర్సన్‌ షమీంఅస్లాం వేర్వేరుగా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. మున్సి పల్‌ కౌన్సిలర్లు  పాల్గొన్నారు. దేవతానగర్‌లోని టీడీపీ పార్లమెంట్‌ కార్యా లయం వద్ద ప్రధాన కార్యదర్శి దొరస్వామినాయుడు, మహ్మద్‌, విజయ, శ్యామల గాంధీ చిత్రటానికి పూజలు చేశారు. స్థానిక నిమ్మనపల్లె సర్కిల్‌ వద్ద టీడీపీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేశ్‌ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. టీడీపీ నేతలు లక్ష్మన్న, పఠాన్‌ఖాదర్‌ ఖాన్‌, భాస్కర, శ్రీనివాసులు, రాజన్న, రామచంద్ర పాల్గొన్నారు.  మహాత్మా గాంధీ జయంతిని పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు.  కార్యక్రమంలో నాయకులు నాగూర్‌వలీ, వేమయ్య, గిరీష్‌, రెడ్డిసాహెబ్‌, ఇంతియాజ్‌, నజీర్‌  పాల్గొన్నారు. ఆశ్రమంలో  పట్టణం లోని బర్మావీధిలో ఉన్న చైతన్య స్వచ్ఛందసేవా సంస్థలో నిర్వాహకు లు ఎంపీ ఆనందన్‌ ఆధ్వర్యంలో, కోళ్లబైలు పంచాయతి, అమ్మచెరు వుమిట్టలోని వెలుగు ప్రత్యేక పాఠశాల్లో ఆధివారం మహాత్మగాంధీ 153వ జయంతిని ఘనంగా నిర్వహించారు.   

Read more