ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్దాం

ABN , First Publish Date - 2022-08-26T04:29:54+05:30 IST

కలిసి కట్టుగా కృషిచేసి ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకుతీసుకెళ్దామని వైఎస్సార్‌ క్రాంతి పథం ఏపీఎం ఆంజనేయులు, ప్రకృతి వ్యవసాయ మాస్టర్‌ ట్రైనర్‌ భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్దాం
మహిళా సంఘ సభ్యులకు లఅవగాహన కల్పిస్తున్న ఏపీఎం, మాస్టర్‌ ట్రైనర్‌లు

లింగాల, ఆగస్టు 25: కలిసి కట్టుగా కృషిచేసి ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకుతీసుకెళ్దామని వైఎస్సార్‌ క్రాంతి పథం ఏపీఎం ఆంజనేయులు, ప్రకృతి వ్యవసాయ మాస్టర్‌ ట్రైనర్‌ భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక మహిళా శక్తి భవనంలో మహిళా సంఘలా సభ్యులతో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతేకాకుండా ప్రకృతి వ్యవసా యం ద్వారా పండించిన శనగలను మార్కెట్‌ కంటే పదిశాతం అధిక ధరతో తిరుపతి దేవస్థానం వారు కొనుగోలు చేస్తారన్నారు. కషాయాలు, ద్రావణాలనతో పండించాలన్నారు.క్లస్టర్‌ కోఆర్డినేటర్‌ ఉత్తయ్య, యూనిట్‌ ఇనచార్జి కృష్ణయ్య, వెంకటప్ప, హారతి, నీలావతి, పాల్గొన్నారు.

Read more